లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - stock market indices trading higher
close

Updated : 07/05/2021 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కీలక రంగాల షేర్లు రాణిస్తుండండం సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. అలాగే కరోనా టీకాలపై మేధో హక్కుల నిబంధనలను తాత్కాలికంగా రద్దు చేయాలని డబ్ల్యూటీఓలో భారత్‌ చేసిన ప్రతిపాదనను అమెరికా సమ్మతించింది. దీనివల్ల టీకాల సరఫరా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును పెంచింది. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 385 పాయింట్లు లాభపడి 49,335 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 119 పాయింట్లు ఎగబాకి 14,843 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.62 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఐదు మినహా మిగతా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్‌ ఆటో, నెస్లే ఇండియా, పవర్‌ గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని