భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు - stock market tumbles 700 points
close

Published : 22/01/2021 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమ్మకాల ఒత్తిడితో ఈ ఉదయం బలహీనంగా ప్రారంభమైన సూచీలు.. అంతకంతకూ దిగజారాయి. లోహ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ ఏకంగా 700 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్‌ 674 పాయింట్లు దిగజారి 48,950 వద్ద, నిఫ్టీ 195 పాయింట్ల నష్టంతో 14,395 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతో గురువారం సెన్సెక్స్‌ తొలిసారిగా 50వేల మార్క్‌ను తాకిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నిన్న స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు.. నేడు కూడా అదే బాట పట్టాయి. 

ఇదీ చదవండి..

రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్‌ ధర


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని