ప్రారంభ లాభాలు ఆవిరి! - stock markets end in a negative note
close

Updated : 20/04/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రారంభ లాభాలు ఆవిరి!

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా దిగజారుతూ వచ్చాయి. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్ఠాల్ని నమోదు చేసింది. ఉదయం 48,473 వద్ద భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజులో 48,478 వద్ద గరిష్ఠాన్ని, 47,438 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక 14,526 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 14,526-14,207 మధ్య కదలాడింది. చివరకు సెన్సెక్స్‌ 243 పాయింట్లు నష్టపోయి 47,705 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 14,296 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.95 వద్ద నిలిచింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు లాభాల్లో ముగియగా.. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ సిమెంట్‌ నష్టాలు చవిచూశాయి.   

కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్న కేంద్రం నిర్ణయంతో మార్కెట్లలో ఉదయం కనపడిన ఉత్సాహం మధ్నాహ్నం తర్వాత ఆవిరైంది. పైగా నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు దిగిన మదుపర్లు కాసేపటికే ఉదయపు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. పైగా కరోనా కేసుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడం సూచీలపై మరింత ప్రభావం చూపింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు మార్కెట్లు చివరకు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని