Stock market: మళ్లీ నష్టాల్లోకి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు! - stock markets ends in red
close

Updated : 27/10/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: మళ్లీ నష్టాల్లోకి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

ముంబయి: రెండు రోజుల విరామం తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు చివరి గంట వరకు స్వల్ప లాభాల్లో కొనసాగాయి. కానీ, చివర్ల్లో కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు కిందకు దిగజారాయి. ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్‌ సూచీలు సైతం నష్టాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చమురు ధరల పెరుగుదల.. తద్వారా ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నష్టాలతో ముగిశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 61,499.70 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,576.85 - 60,989.56 మధ్య కదలాడింది. చివరకు 206.93 పాయింట్ల నష్టంతో 61,143.33 వద్ద ముగిసింది. నిఫ్టీ 57.45 పాయింట్లు నష్టపోయి 18,210.95 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌-30 సూచీలో 12 షేర్లు లాభపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, టెక్ మహీంద్రా రాణించాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని