ఎఫ్‌డీలో ముందుగా విత్‌డ్రా చేసుకున్నా పెనాల్టీ ప‌డ‌కూడ‌దంటే... - sweep-in-Fixed-deposits
close

Published : 26/03/2021 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎఫ్‌డీలో ముందుగా విత్‌డ్రా చేసుకున్నా పెనాల్టీ ప‌డ‌కూడ‌దంటే...

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డుల‌పై భ‌ద్ర‌త ఉండ‌టంతో పెట్టుబ‌డుల‌కు ఆస‌క్తి చూపుతారు. దీంతో పాటు ఆశించిన రాబ‌డి కూడా పొంద‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ‌ లిక్విడిటీ కాస్త స‌మ‌స్య‌గా ఉంటుంది. ఏదైనా అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో మెచ్యూరిటీకి ముందే డ‌బ్బు విత్‌డ్రా చేసుకుంటే లేదా మూసివేస్తే అద‌న‌పు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు వ‌డ్డీ రేట్లు కూడా త‌గ్గుతాయి. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మంచ‌డానికి చాలా బ్యాంకులు స్వీప్-ఇన్‌-అకౌంట్స్‌ ప్రారంభించాయి. ఈ ఖాతాల‌తో పొదుపు, డిపాజిట్ల‌కు కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంది. అదేవిధంగా లిక్విడిటీ అవ‌కాశం కూడా ఉంటుంది. సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే దీనిలో వ‌డ్డీ రేట్లు ఉంటాయి. స్వీప్‌-ఇన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఉన్న మ‌రో అద‌న‌పు ప్ర‌యోజ‌నం ఏంటంటే లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉండ‌దు. అదేవిధంగా ముందుగా డ‌బ్బు తీసుకుంటే ఎలాంటి రుసుములు ఉండ‌వు. స్వీప్‌-ఇన్ ఖాతాలో క‌నీస నిల్వ‌ను ఖాతాదారుడు నిర్ణ‌యించుకుంటాడు. అంత‌కుమించి డిపాజిట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతాయి. ఎప్పుడైతే ఖాతాదారుడు డ‌బ్బు అవ‌స‌ర‌మ‌నుకుంటే సేవింగ్స్ ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ (స్వీప్ ఇన్‌) చేసుకోవ‌చ్చు.


ఉదాహ‌ర‌ణ‌కు, పొదుపు ఖాతాలో రూ.2 ల‌క్ష‌లు ఉంటే మీరు ప‌రిమితి రూ.20 వేలుగా నిర్ణ‌యించుకున్నారు. మిగ‌తా రూ.180,000 ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఖాతాకు ట్రాన్స్‌ప‌ర్ అవుతాయి. ఒక‌వేళ మీకు రూ.20 వేల కంటే ఎక్కువ‌గా అవ‌స‌రం అయితే ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి పొదుపు ఖాతాలోకి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అయితే సొంతంగా ప‌రిమితి విధించుకునే అవ‌కాశాన్ని కొన్ని బ్యాంకులు మాత్ర‌మే ఇస్తాయి. మ‌రిన్ని బ్యాంకుల్లో రూ.20 వేల నుంచి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ప‌రిమితిని వారే నిర్ణ‌యిస్తారు. దీంతో పాటు క‌నీస నిల్వ రూ.1000 నుంచి రూ.10,000 వ‌రకు ఉండాలి. కొన్ని బ్యాంకుల్లో స్వీప్‌-ఇన్ ఎఫ్‌డీల కాల‌ప‌రిమితి ఏడాది మాత్ర‌మే ఉంటుంది.

స్వీప్‌-ఇన్ ఖాతాల ద్వారా త‌క్కువ ప‌న్ను శ్లాబులోకి వ‌చ్చేవారికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఎందుకంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌చ్చిన ఆదాయంపై ప‌న్ను శ్లాబు ప్ర‌కారం వ‌ర్తిస్తుంది. అయితే సెక్ష‌న్ 80టీటీఏ ప్ర‌కారం వ‌డ్డీ ఆదాయం రూ.10 వేల కంటే త‌క్కువ‌గా ఉంటే ప‌న్ను వ‌ర్తించ‌దు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని