ఇంటర్నెట్ డెస్క్: టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ మోడల్లో మరో కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఆల్ట్రోజ్ ఐ-టర్బోగా పేర్కొంటున్న ఈ కారు ప్రమీయం హాచ్బ్యాక్ సెగ్మెంట్లో సరికొత్త ఫీచర్లు, కనెక్ట్ టెక్నాలజీ, మరింత శక్తిమంతమైన ఇంజిన్‌తో వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఎక్స్‌టీ, ఎక్స్జెడ్, ఎక్స్‌జెడ్‌ప్లస్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆల్ట్రోజ్ రెవోట్రాన్ మోడళ్ల కంటే దీని ధర రూ.60వేలు అధికంగా ఉంది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.8.26 లక్షలు కాగా.. డీజిల్‌ది రూ.9.46 లక్షలు(దిల్లీ, ఎక్స్‌షోరూం).
1.2-లీటర్ టర్బోఛార్జ్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 5,500 ఆర్పీఎం వద్ద 108 బీహెచ్పీ, 1,500-5,500 ఆర్పీఎం మధ్య 140 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. అత్యాధునిక ‘ఇంటెలిజెన్స్ రియల్-టైం అసిస్ట్(iRA-connected)’ సాంకేతికతను పొందుపరిచారు. మొత్తం 27 కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి. దీని ద్వారా ఇంగ్లిష్, హిందీతో పాటు ‘హింగ్లిష్’(హిందీ+ఇంగ్లిష్) కమాండ్లను కూడా ఇది అర్థం చేసుకుంటుంది. హ్యుందాయ్ ఐ-20 టర్బో, ఫోక్స్‌వ్యాగన్ పోలో జీటీ వంటి వాటికి పోటీగా టాటా ఈ కొత్త ఆల్ట్రోజ్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి...
‘పెట్రోల్’పై సుంకం తగ్గిస్తారా?
బడ్జెట్ 2021: నిర్మలమ్మ ముందున్న సవాళ్లు!
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?