టాటా కార్లు మరింత ప్రియం.. ధరల పెంపు ఎంతంటే? - tata motors to increase car prices from august 3 2021
close

Published : 02/08/2021 21:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటా కార్లు మరింత ప్రియం.. ధరల పెంపు ఎంతంటే?

ముంబయి: ఆగస్టు  3 నుంచి తమ సంస్థ విక్రయించే కార్లు తదితర ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచుతున్నట్లు దేశీయ వాహన ఉత్పత్తి సంస్థ టాటా మోటార్స్‌ ప్రకటించింది.  మోడల్‌, వేరియంట్‌ ఆధారంగా ధరల పెంపు సగటున 0.8 శాతం వరకు ఉంటుందని తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులు, డీలర్లు, సరఫరాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు, వారికి సేవలందించేందుకు.. ‘బిజినెస్‌ ఎజిలిటీ ప్లాన్‌’లో ఈ నిర్ణయం ఓ భాగమని వెల్లడించింది. ముడి పదార్థాల ధరలూ పెరగడం ఓ కారణం. అయితే.. ఆగస్టు 31, లోగా బుక్‌ చేసుకున్న వాహనాలకు ధరల పెంపునుంచి మినహాయింపు ఉంటుందని చెప్పింది. ఈ ఏడాదిలో ఇలా ధరలు పెంచడం ఇది మూడోసారి. మేలో 1.8 శాతం పెంచారు. జనవరిలోనూ ఓసారి కార్ల ధరలను దాదాపు రూ.26 వేల వరకు పెంచారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని