గృహ రుణంపై రూ.3.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు  - tax-deductions-on-home-loan
close

Updated : 30/01/2021 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 గృహ రుణంపై రూ.3.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు 

సాధారణంగా, ఇల్లు కొనడం అనేది ఒక వ్యక్తి జీవితంలో అతిపెద్ద కొనుగోళ్లలో ఒకటి. ఇళ్ల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండ‌టం కార‌ణంగా  చాలావ‌ర‌కు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు గృహ రుణాన్ని తీసుకుంటారు.  గృహ కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించడానికి, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్స‌హించ‌డానికి ప్ర‌భుత్వం గృహ రుణ వడ్డీపై కొన్ని పన్ను మినహాయింపులను  ఇస్తోంది. కానీ ఈ తగ్గింపులు  కొన్ని షరతులతో వస్తాయి.

గృహ రుణంపై చెల్లించిన అసలు, వడ్డీపై ఎంత‌మేర‌కు క్లెయిమ్ చేయవచ్చో అర్థం చేసుకుందాం. దీంతో పాటు ఈ ప్రయోజనాన్ని పొందటానికి తెలుసుకోవాల్సిన ప‌రిమితులు ఇక్క‌డ ఉన్నాయి.

అస‌లుపై తగ్గింపు:
సెక్షన్ 80 సి కింద మీరు అస‌లు అప్పు తిరిగి చెల్లించినందుకు రూ.1.5 లక్షల తగ్గింపును పొందవచ్చు. ఏదేమైనా, ఈ పన్ను మినహాయింపు పొందిన తరువాత పన్ను చెల్లింపుదారుడు ఆ ఇంటిని 5 సంవత్సరాలలోపు అమ్మ‌కూడ‌దు. అలాచేస్తే మిన‌హాయింపు  వ‌ర్తించ‌దు.

గృహ రుణ వడ్డీపై తగ్గింపు:
ఆదాయపు పన్ను చట్టం  సెక్షన్ 24 (బి) ప్రకారం, పన్ను చెల్లింపుదారుడు స్వీయ‌ గృహ రుణంపై చెల్లించే వడ్డీపై రూ. 2 లక్షల తగ్గింపును పొందవచ్చు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాతే మినహాయింపు లభిస్తుంది.

సెక్షన్ 80ఈఈఏ కింద అదనపు మినహాయింపు:
ఒకవేళ మీరు 2019-20 ఆర్థిక సంవత్సరంలో గృహ రుణం తీసుకొని ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేస్తుంటే, సెక్షన్ 80 ఈఈఏ కింద ఈ సంవత్సరం నుంచి రూ. 1.5 లక్షల అదనపు తగ్గింపును  పొంద‌వ‌చ్చు. సరసమైన గృహనిర్మాణ విభాగంలో కొనుగోలుదారులకు సహాయపడటానికి ఈ తగ్గింపును కేంద్ర బడ్జెట్ 2019 లో ప్రవేశపెట్టింది, ఇది షరతులకు లోబడి ఉంటుంది.

ఈ అదనపు మినహాయింపు పొందడానికి, గృహ రుణాన్ని ఏప్రిల్ 1, 2019, మార్చి 31, 2020 మధ్య మంజూరు చేసి ఉండాలి. ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ  రూ. 45 లక్షల లోపు ఉండ‌వ‌చ్చు. మొదటిసారి ఇంటిని కొనుగోలుచేసిన‌వారికే ఇది వ‌ర్తిస్తుంది. రుణం తీసుకున్న‌ తేదీ నాటికి మ‌రో ఇంటిని కలిగి ఉండకూడదు.
ఈ మినహాయింపు సెక్షన్ 24 (బి) కింద లభించే 2 లక్షల తగ్గింపు పైన లభిస్తుంది
ఉదాహరణకు, సంవత్సరానికి గృహ రుణంపై చెల్లించే వడ్డీ రూ. 3.5 లక్షలు అని అనుకోండి. మీరు సెక్షన్ 24 (బి) కింద రూ. 2 లక్షలు, సెక్షన్ 80ఈఈఏ కింద రూ. 1.5 లక్షలు క్లెయిమ్ చేయవచ్చు.

సెక్షన్ 80ఈఈ కింద అదనపు మినహాయింపు:
సెక్షన్ 50 ఈఈ  మినహాయింపు ఏప్రిల్ 1, 2016, 31 మార్చి, 2017 మధ్య మంజూరు చేసిన రుణం మీద రూ. 50 లక్షల విలువైన  ఇంటిపై, రూ.35 లక్షల వరకు పొందితే లభిస్తుంది. సెక్షన్ 80ఈఈఏ, సెక్షన్ 24 (బి) కింద ల‌భించే తగ్గింపు కాకుండా ఇది అద‌నం. అయితే మీరు సెక్షన్ 80ఈఈ కింద రూ. 50,000 తగ్గింపును క్లెయిమ్ చేస్తే, సెక్షన్ 80ఈఈఏ కింద తగ్గింపును క్లెయిమ్ చేయడానికి వీలుండ‌దు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని