‘రియల్‌’అవసరాలు గుర్తించండి..! - tax rationalisation liquidity enhancement top real estate sectors budget wishlist
close

Published : 25/01/2021 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రియల్‌’అవసరాలు గుర్తించండి..!

 బడ్జెట్‌ నిర్ణయాలపై భవిష్యత్తు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి 2020 ఓ పీడకల. కొన్ని నెలల పాటు ప్రాజెక్టులు ఆగిపోవడం.. కూలీల కొరత.. ముడిసరుకుల కొరత.. పెరిగిపోతున్న వడ్డీలు ఇలా స్థిరాస్థి రంగం ముప్పేట దాడికి గురైంది.  ఫలితంగా చాలా ప్రాజెక్టులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మరోపక్క భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోవడం కూడా స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఇళ్లకు భారీగా డిమాండ్‌ తగ్గింది. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది. 

అందివచ్చిన అన్ని చర్యలు చేపట్టి..

ప్రభుత్వం ఒక దశలో బ్యాంకుల ఆర్థిక పటిష్ఠతను కూడా పక్కనబెట్టి  నెలవారీ వాయిదాలపై మారిటోరియం విధించడం, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల రుణాలను పునర్‌వ్యవస్థీకరణ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ‘స్వామిహ్‌   నిధి’(స్పెషల్‌ విండో ఫర్‌ కంప్లిషన్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ అఫర్డబుల్‌ అండ్‌ మిడ్‌ ఇన్‌కమ్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్స్‌)ను కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు నేషనల్‌ హౌసింగ్‌ బోర్డులో ప్రభుత్వం పెట్టుబడులను పెట్టింది.  దీంతోపాటు వడ్డీరేట్లు 140బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించింది. దీంతో గత 15ఏళ్లలో  ఎన్నడూ లభించనంత తక్కువరేటుకు గృహకొనుగోళ్లకు అప్పులు వస్తున్నాయి. 

రియల్‌ఎస్టేట్‌ రంగం ఏమి కోరుకుంటోంది..

జీడీపీలో దాదాపు 8 శాతం రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచే లభిస్తోంది.  అటువంటి రంగం పూర్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏ మాత్రం సరిపోవు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఇల్లు అందించే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంది. ఈ ఏడాది డిమాండ్‌ పుంజుకోకపోతే రియల్‌ ఎస్టేట్ రంగం అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.  దీంతో నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ పలు సూచనలు చేసింది. 

* గృహరుణాల వడ్డీరేట్లను సవరించాలి. లోన్‌ టూ వాల్యూ నిష్పత్తిని 90శాతానికి పైగా చేయాల్సి ఉంది. దీనిని మధ్యశ్రేణి, ఉన్నతశ్రేణి గృహాలకు కూడా వర్తింపజేయాలి. 

*  ఆదాయపుపన్ను తగ్గింపులకు అనుమతి ఇవ్వాలి. దీనిపై ఎటువంటి సీలింగ్‌ విధించకూడదు. 

* ప్రస్తుతం లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ అసెట్‌గా గుర్తించాలంటే ఉన్న 24-36 నెలల కాల వ్యవధిని 12 నెలలకు తగ్గించాలి. 

* హౌస్‌రెంట్‌ అలవెన్స్‌ పన్ను మినహాయింపును మరింత పెంచాలి. దీంతోపాటు అందుబాటు ధరలోని గృహాల కోసం ఇచ్చే రుణాల రేటుపై రాయితీలు ఇవ్వాలి. 

* అద్దె ఇంటిపై వచ్చే ఆదాయంపై మినహాయింపును 30శాతం నుంచి 50శాతానికి పెంచాలి. ఈ చర్యతో చాలా మంది అద్దెలకు ఇచ్చేందుకు నివాసగృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతారు. 

* ఇక ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐటీ,ఐటీఈఎస్‌ సెజ్‌ వంటి వాటిల్లో ఈసీబీ(ఎక్స్‌ట్రనల్‌ కమర్షియల్‌ బారోయింగ్‌)అనుమతించాలి. మినిమమ్‌ ఆల్టర్‌నేట్‌ పన్నును తొలగించాలి. 

* భూములను డెవలప్‌మెంట్‌కు ఇచ్చే సమయంలో టీడీఆర్‌(ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌)పై జీఎస్‌టీని తగ్గించాలి. ఈ చర్యతో కొత్త ప్రాజెక్టులు మొదలై భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 

ఇవీ చదవండి

పన్ను రూపంలో కరోనా కాటు..!
దేశీయ తయారీకి బడ్జెట్‌లో ఊతం!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని