close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120026882 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => lF9jS4rn7-0 [video_short_link] => lF9jS4rn7-0 [created_by] => [created_date] => [modified_by] => 1071079 [modified_date] => 2020-02-25 18:54:49.41725 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు

1. కాపీ - పేస్ట్‌ - ఐఓఎస్‌

మొబైల్‌ ఫోన్స్‌లో ఏదైనా కాపీ చేసి.. వేరే దగ్గర పేస్ట్‌ చేయడం కొత్తేమీ కాదు. కానీ, యాపిల్‌ ఫోన్స్‌ వాడేవాళ్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు అంతర్జాతీయ టెక్‌ నిపుణులు. కట్‌ - కాపీ - పేస్ట్‌ విషయంలో యాపిల్‌ ఫోన్లలో సాంకేతిక సమస్య ఉందని టామీ మిస్క్‌ అనే నిపుణుడు చెబుతున్నారు. కాపీ చేసిన డేటా... మొబైల్‌లో సేవ్‌ అవుతోందట. దాని వల్ల అగంతుకులు మీ మొబైల్‌ను హ్యాక్‌ చేసి ఆ సురక్షితమైన డేటాను తస్కరించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. గతంలోనూ యాపిల్‌ విషయంలో ఇలాంటి సమస్య వచ్చింది. మరిప్పుడు ఈ సమస్యను ఎలా ఫిక్స్‌ చేస్తారో చూడాలి. 


2. వన్‌ప్లస్‌ కొత్త ‘ప్రో’ ముచ్చట్లు

ఏడాదికో సిరీస్‌ ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌ తీసుకొచ్చే వన్‌ప్లస్‌... ఈ ఏడాది వన్‌ప్లస్‌8 తీసుకురాబోతోంది. ఇందులో ప్రో మోడల్‌ గురించి కొన్ని విషయాలు బయటికొచ్చాయి. దీంతోపాటు మొబైల్‌ ఇలా ఉండొచ్చు అంటూ కొన్ని ఫొటోలు కూడా బయటికొచ్చాయి. వాటి ప్రకారం చూస్తే ఈ మొబైల్‌లో 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటాయి. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ ఉండబోతోంది. 5జీ సాంకేతికతతో రాబోతోంది. ముందువైపు కటౌట్‌ సెల్ఫీ కెమెరా ఉండబోతోంది. ముందుగా తెలిసిన ప్రకారం ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ ఉండబోతోంది. 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేటుతో ఆమోలెడ్‌ స్క్రీన్‌ ఇస్తున్నారు. 


3. రియల్‌మీ మరో ఫోన్‌ సిద్ధం చేస్తోంది!

జనవరిలో 5ఐ మొబైల్‌ను తీసుకొచ్చిన రియల్‌మీ మరో బడ్జెట్‌ మొబైల్‌ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. రియల్‌మీ 6ఐ పేరుతో త్వరలోనే ఈ మొబైల్‌ను లాంచ్‌ చేయబోతున్నారట. వైర్‌లెస్‌ అథారిటీ నుంచి ఈ మొబైల్‌ సర్టిఫై అయ్యింది. దాని ఆధారంగా చూస్తే...  ఈ మొబైల్‌లో వెనుకవైపు 48 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. దీంతోపాటు ఈ మొబైల్‌ 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుందని సమాచారం. అయితే యూఎస్‌బీ సీ పోర్టు ఉండదని తెలుస్తోంది.  


4. సోనీ ఎక్స్‌పీరియా విత్‌ 4K

మంచి కెమెరా ఉన్న ఫోన్‌ అంటే.. ఠక్కువ గుర్తొచ్చే మొబైల్స్‌లో సోనీ ఒకటి. మన దేశంలో మొబైల్స్‌ వ్యాపారం ఆపేసినా.. అంతర్జాతీయ మార్కెట్‌లో సోనీ కొనసాగుతోంది. ఈ క్రమంలో 4కె స్క్రీన్‌తో ఓ మొబైల్‌ తీసుకొస్తోంది. ఎక్స్‌పీరియా 1 మార్క్‌ II పేరుతో ఓ మొబైల్‌ను పరిచయం చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ ఉండబోతోంది. వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్‌ ఉంటుంది. 12 ఎంపీ కెమెరాలు మూడు, 3డీ టీవోఎఫ్‌ కెమెరా ఉంటాయి.  8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉన్న ఈ మొబైల్‌లో 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు.


5. ఛార్జింగ్‌: ట్యాబ్‌ టు మొబైల్‌

ఐప్యాడ్‌ ప్రోకు పోటీగా హువావే ఓ ప్యాడ్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కొన్ని  స్పెసిఫికేషన్లు ఇప్పుడు బయటికొచ్చాయి. 10.8 అంగుళాల స్క్రీన్‌ ఉండే ఈ మేట్ ప్యాడ్‌లో 7250 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. దాని నుంచి మొబైల్స్‌కు రివర్స్‌ ఛార్జింగ్‌ పెట్టుకునే ఆప్షన్‌ కూడా ఉందని సమాచారం. ఈ ప్యాడ్‌తో కీబోర్టు ఫోలియో, ఎం పెన్సిల్‌ స్టైలస్‌ కూడా ఉంటాయి. అయితే వాటిని వేరేగా కొనుగోలు చేయాలి. ఈ ప్యాడ్‌ ప్రస్తుతానికి చైనాలో అందుబాటులోకి తీసుకొస్తారట. మన దేశం సంగతి తెలియాల్సి ఉంది. 


6. హెచ్‌టీసీ నుంచి 5జీ ఫోన్‌

వరుస ఫోన్లు తీసుకొస్తూ ఇటీవల కాస్త నెమ్మదించిన హెచ్‌టీసీ గతేడాది ఎక్సోడస్‌ 1ఎస్‌ అనే బడ్జెట్‌ ఫోన్‌ మాత్రమే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌ మాత్రం తీసుకురాలేదు. కానీ, ఈ ఏడాది రాబోతోంది.  5జీ సాంకేతికతతో ఓ మొబైల్‌ తీసుకురావాలని హెచ్‌టీసీ చూస్తోంది. అయితే ఈ మొబైల్‌ ఏ ప్రాసెసర్‌తో వస్తుంది, ర్యామ్‌, మెమొరీ, కెమెరా లాంటి వివరాలు తెలియడం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటికొస్తాయి. మరి ఈ ఏడాది ఎలాంటి ఫోన్‌ తెస్తుందో చూడాలి. 


7. క్రోమ్‌ వాడండి బాబూ...

మా బ్రౌజర్‌ చాలా బాగుంటుంది వాడండి... ఇటీవల కాలంలో ఇలాంటి పాప్‌ అప్‌లు రావడం మానేశాయి. తాజాగా గూగుల్‌ క్రోమ్‌ ఆ స్టైల్‌ ప్రచారానికి దిగింది అంటున్నారు అంతర్జాతీయ టెక్‌  నిపుణులు. మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్లు వాడుతున్న యూజర్లకు క్రోమ్‌ వాడండి అంటూ పాప్‌ అప్‌లు ఇస్తోందట. ఎడ్జ్‌ కూడా క్రోమియం బేస్డ్‌ బ్రౌజరే  కావడంతో అందులోనూ ఎక్స్‌టెన్షన్లు వాడుకోవచ్చు. అలా ఎక్స్‌టెన్షన్‌ కోసం సెర్చ్‌ చేస్తే... ‘క్రోమ్‌ అయితే మరింత సెక్యూర్డ్‌ వాడొచ్చు’ అంటూ కొంతమందికి పాప్‌ అప్‌ వస్తోందట. 


8. మెయిల్‌ వచ్చిందా... పాస్‌వర్డ్‌ మార్చుకోండి

కొన్ని రోజుల క్రితం కొంతమంది శాంసంగ్‌ యూజర్లకు  ‘ఫైండ్‌ మై మొబైల్‌’ ఫీచర్‌ నుంచి నోటిఫికేషన్‌ వచ్చింది. ఆ ఆప్షన్‌ను వాడకుండానే నోటిఫికేషన్లు వచ్చేసరికి ఆ యూజర్లు ఆందోళనకు గురయ్యారు. దీనిపై ఇప్పుడు శాంసంగ్‌ స్పందించింది అంటూ అంతర్జాతీయ టెక్‌ మీడియా వార్తలు రాసింది. వాటి ప్రకారం చూస్తే ‘‘సాంకేతిక సమస్య వల్ల ‘ఫైండ్‌ మై మొబైల్‌’ నోటిఫికేషన్ల సమస్య కొంతమందికే వచ్చింది. దానిని వెంటనే గుర్తించి సరి చేశాం. ఆ సమస్య ఎదుర్కొన్న వినియోగదారులతో కాంటాక్ట్‌ అవుతాం’’ అని చెప్పింది. దీనికి సంబంధించి మెయిల్‌ వచ్చిన వినియోగదారులు పాస్‌ వర్డ్‌ మార్చుకొని, టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను యాక్టివ్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  


9. పిక్సల్‌ లాంచర్‌లో కొత్త ఫీచర్లొస్తాయ్‌

ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్‌ ఆండ్రాయిడ్‌ 11 రాకకు రంగం సిద్ధమైంది. ఇటీవల దీనికి సంబంధించిన కొన్ని ప్రాథమిక వివరాల్ని ఇటీవల వెల్లడించారు కూడా. ఈ క్రమంలో పిక్సల్‌ లాంచర్‌లో కూడా మార్పులు చేస్తున్నారు. కొత్త ఓఎస్‌తోపాటే లాంచర్‌లో మార్పులూ తీసుకొస్తారట. యాక్షన్‌ లాంచర్‌, నోవా లాంచర్‌, లాన్‌చైర్‌ లాంచర్లకు దగ్గరగా ఉండేలా పిక్సల్‌ లాంచర్‌లో మార్పులు చేస్తున్నారట. కొత్త వెర్షన్‌ లాంచర్‌లో రీసెంట్స్‌ లోకి వెళ్తే కొత్తగా సెలక్ట్‌, స్క్రీన్‌ షాట్‌, షేర్‌ ఆప్షన్‌ రాబోతున్నాయి. షేర్‌ ఆప్షన్‌ థర్డ్‌ పార్టీ షేర్‌ కన్నా మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. 


10. హువావే 5జీ మడత ఫోన్‌ చూశారా?

5జీ సాంకేతికతతో హువావే తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ లాంచ్‌ చేసింది. 6.6 అంగుళాల మెయిన్‌ స్క్రీన్‌ ఉన్న ఈ మొబైల్‌లో 6.38 అంగుళాల సెకండరీ డిస్‌ప్లే ఉండబోతోంది. మడత విప్పితే ఈ మొబైల్‌లో 8 అంగుళాల టాబ్లెట్‌గా మారిపోతుంది. మరి ఎలా ఉందో ఈ దిగువ వీడియోలో చూసేయండి. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.