close
Array ( ) 1

తాజా వార్తలు

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు

1. ‘సర్టిఫికెట్‌’తో వస్తున్న తొలి మొబైల్‌

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌తో ఒప్పొ, హువావే, శాంసంగ్‌ నుంచి చాలా మొబైల్స్‌ ఇది వరకే వచ్చాయి. వస్తున్నాయి కూడా. అయితే సర్టిఫికెట్‌ను మాత్రం క్లైమ్‌ చేయవు. తొలిసారిగా యూఎస్‌బీ ఫాస్ట్‌ ఛార్జర్‌ సర్టిఫికేషన్‌తో శాంసంగ్‌ నుంచి మొబైల్స్‌ రాబోతున్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 20 సిరీస్‌ మొబైల్స్‌లో ‘సర్టిఫైడ్‌ యూఎస్‌బీ ఫాస్ట్‌ ఛార్జర్‌’ అనే స్టేటస్‌ ఉండబోతోందని సమాచారం. అంతకుముందు వచ్చిన శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 10 ప్లస్‌లో 45 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉన్నా.. దానికి సర్టిఫికెట్‌ లేదు. భవిష్యత్‌లో చాలా సంస్థలు ఇలా సర్టిఫికెట్‌తో వస్తాయని టెక్‌ వర్గాల సమాచారం.


2. రియల్‌మీ కొత్త బ్లైండ్‌ ఆర్డర్

బడ్జెట్‌ మొబైల్స్‌ రేంజీలో రియల్‌మీ నుంచి మరో మొబైల్‌ రాబోతోంది. రియల్‌మీ 6 సిరీస్‌లో రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో వచ్చే నెల 5న మన దేశంలో లాంచ్‌ కాబోతున్నాయి. ఈ మొబైల్స్‌కు ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మొబైల్‌కు రియల్‌మీ బ్లైండ్‌ ఆర్డర్‌ సేల్‌ నడుపుతోంది. వచ్చే నెల నాలుగో తేదీ లోపు ₹1000 చెల్లించి ప్రీ ఆర్డర్‌ (బ్లైండ్‌ ఆర్డర్‌) చేసుకోవచ్చు. అలా కొన్నవారికి ₹1000 వోచర్‌ ఉచితంగా ఇవ్వనున్నారు. దాంతో రియల్‌మీ బడ్స్‌ వైర్‌లెస్‌ కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ మొబైల్‌ స్పెసిఫికేషన్లు చూస్తే..  ఇందులో 90 హెడ్జ్‌ డిస్‌ప్లే ఉండబోతోంది. దీంతోపాటు ఈ మొబైల్స్‌ 30 వాట్‌ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తాయి.


3. గూగుల్‌ వేర్‌తోనే ఒప్పొ వాచ్‌

ఒప్పొ నుంచి స్మార్ట్‌ వాచ్‌ రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు లీక్‌ అయ్యాయి కూడా. తాజాగా ఈ వాచీకి సంబంధించిన మరో ఫొటో బయటికొచ్చింది. దాని బట్టి చూస్తే ఈ వాచీ గూగుల్‌ వేర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. వచ్చే నెల 6న ఈ వాచీని అంతర్జాతీయ మార్కెట్‌లో లాంచ్‌ చేస్తారని తెలుస్తోంది. తొలుత MWC 2020లో లాంచ్‌ చేయాలని ఒప్పొ భావించింది. అయితే ఈవెంట్‌ రద్దు అవడంతో ఆవిష్కరణ ఆలస్యమైంది.  


4. TIP : వాట్సాప్‌లో బ్లూ టిక్‌ రాకపోయినా...

వాట్సాప్‌లో మీరు పంపిన మెసేజ్‌ అవతలి వ్యక్తి చూశారా లేదో తెలుసుకోవడానికి బ్లూటిక్‌ ఉపయోగపడుతుంది. అయితే అవతలి వ్యక్తి ‘రీడ్‌ రిసిప్ట్స్‌’ ఆప్షన్‌ ఆఫ్‌ చేస్తే ఇది వీలవదు. అయితే ఇలాంటి సందర్భంలోనూ ఓ కిటుకు ఉంది. మెసేజ్‌లన్నీ పంపించాక... ఆఖరులో ఓ వాయిస్‌ నోట్‌ కూడా పంపండి. అప్పుడు వాయిస్‌ నోట్‌లో ఎడమవైపు ఉన్న థంబ్‌ పక్కన ఓ మైక్‌ సింబల్‌ కనిపిస్తుంది. ఆ వాయిస్‌ నోట్‌ను అవతలి వ్యక్తి విన్నాక... ఆ మైక్‌  సింబల్‌ గ్రే నుంచి బ్లూలోకి మారుతుంది. మీ వాయిస్‌ క్లిప్‌ విన్నారు అంటే... అంతకుముందు పంపిన మెసేజ్‌లు చూసినట్లే కదా. అదన్నమాట టిప్‌. మీరూ ఓసారి ట్రై చేయండి మరి.


5. ఐఓఎస్‌ 14లో ఆసక్తికర ఫీచర్‌

ఆపిల్‌ ప్యాడ్స్‌ వాడేవాళ్లకు బాగా నచ్చే ఫీచర్లలో మల్టీటాస్కింగ్‌ ఇంటర్ఫేస్‌ ఒకటి. ఐప్యాడ్‌లో రీసెంట్‌ యాప్స్‌ను చూపించే విధానం బాగుంటుంది. దీనిని కొత్త ఐఓఎస్‌తో మొబైల్స్‌కు కూడా తీసుకొస్తారని తెలుస్తోంది. ఐఓఎస్‌ 14లో మల్టీటాస్కింగ్‌ స్టైల్‌ను మార్చబోతున్నారట. ఈ విషయాన్ని ఓ టెక్‌ వెబ్‌సైట్‌ బయటకు తీసుకొచ్చింది. టాస్కింగ్‌ స్టైల్‌ను మార్చుకునేలా సెట్టింగ్స్‌లో డెక్‌ స్విచర్‌, గ్రిడ్‌ స్విచర్‌, మినిమం వయబుల్‌ స్విచర్‌ అని స్టైల్స్‌ కనిపిస్తాయి. 


6. రోజుకు 19 సార్లు తప్పుగా...

మీ మొబైల్‌లో ఓకే గూగుల్‌ అంటేనే...  గూగుల్‌ అసిస్టెంట్ యాక్టివేట్‌ అవుతుంది. అలానే సిరి, అలెక్సా, గూగుల్‌ హోం లాంటివి కూడా వాటికి నిర్దేశించిన వాక్యాలతో కమాండ్‌ ఇస్తేనే యాక్టివేట్‌ అవుతాయి. కానీ ఎలాంటి నిర్దేశిత కమాండ్‌లు ఇవ్వకపోయినా వాయిస్‌ అసిస్టెంట్స్ యాక్టివ్‌ అయిపోతున్నాయట. సగటును రోజుకు 19సార్లు ఇవి యాక్టివ్‌ అయిపోతున్నాయని టెక్‌ పరిశీలకులు అంటున్నారు. మరి వీటికి వాయిస్‌ అసిస్టెంట్ సంస్థలు ఏం చెబుతాయో చూడాలి. 


7. వాల్యూమ్‌ స్టైల్‌ మారబోతోంది..

శాంసంగ్‌ కొత్త యూజర్‌ ఇంటర్ఫేస్‌.. శాంసంగ్‌ వన్‌ యూఐలో కొత్త వెర్షన్‌ త్వరలో రాబోతోంది. వన్‌ యూఐ 2.0గా రాబోతున్న ఇందులో వాల్యూమ్‌ స్లైడర్‌లో మార్పులు రాబోతున్నాయట. ఇప్పటివరకు స్క్రీన్‌ టాప్‌లో ఉన్న వాల్యూమ్‌ స్లైడర్‌.. ఇకపై కుడివైపు కనపడనుంది. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత యూఐ 2.0 మొబైల్స్‌లోనే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుందట. వాల్యూమ్‌ ప్యానల్‌ థీమ్‌ సెట్టింగ్‌లో ఈ స్లైడర్‌ మార్పు చేసుకోవచ్చు. 


8. డార్క్‌ వన్‌డ్రైవ్‌ వచ్చేస్తోంది...

యాప్స్‌ అన్నీ డార్క్‌ మోడ్‌ దారిలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌ వన్‌ డ్రైవ్‌ కూడా నలుపు రంగు పూసుకుంటోంది. ఈ మేరకు యాప్‌లో మార్పులు చేస్తున్నారు. దీంతోపాటు యాప్‌లో కొన్ని మార్పులు, చేర్పులు కూడా రానున్నాయట. ముఖ్యంగా యాప్‌లోని లోగోలను మార్పు చేస్తున్నారు. ‘ఆన్‌ దిస్‌ డే’ అనే ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నారు. గూగుల్‌ ఫొటోస్‌లో ఇలాంటి ఆప్షన్‌ ఇప్పటికే ఉంది.  గతేడాది ఇదే సమయానికి వన్‌ డ్రైవ్‌లో అప్‌లోడ్‌ అయిన ఫొటోలు ఆ రోజు కనిపిస్తాయి. ఈ ఫీచర్లు ప్రయోగాత్మకంగా కొంతమంది యూజర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయట.


9. స్నాప్‌డ్రాగన్‌ కొత్త ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్లివే...

కొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌లో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865తో వచ్చే మొబైల్స్‌ జాబితా బయటికొచ్చింది. ఆయా సంస్థలు ఈ విషయాన్ని చెప్పకపోయినా స్నాప్‌డ్రాగన్‌ చెప్పేసింది. ఈ సంస్థ చెప్పిన జాబితా ప్రకారం చూస్తే  865 ప్రాసెసర్‌తో 16 ఫోన్లు రాబోతున్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికే వచ్చేశాయి. 865 ఉండే ఫోన్లు ఇవే... 
* బ్లాక్‌ షార్క్‌ * ఎఫ్‌సీఎన్‌టి యారోస్‌ 5జీ * ఐక్యూ 3 * లీజియన్‌ గేమింగ్‌ ఫోన్‌ * నుబియా రెడ్‌ మేజిక్‌ 5జీ * ఒప్పొ ఫైండ్స్‌ ఎక్స్‌ * రియల్‌మీ ఎక్స్‌ 50 ప్రో * రెడ్‌మీ కె30 ప్రో * ఆర్‌వోజీ ఫోన్‌ 3 * శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 20, ఎస్‌ 20 ప్లస్‌, ఎస్‌ 20 అల్ట్రా * షార్ప్‌ ఆక్వోస్‌ ఆర్‌ 5జీ * సోనీ ఎక్స్‌పీరియా 1 II * వివో అపెక్స్‌ 2020 కాన్సెప్ట్‌ ఫోన్‌ * షావోమీ ఎంఐ10, ఎంఐ 10 ప్రో * జెన్‌ఫోన్‌ 7 * జెడ్‌టీఈ యాక్సన్‌ 10 ఎస్‌ ప్రో *


10. ఫ్యూజిఫిల్మ్‌ కొత్త కెమెరా వచ్చింది

ఇన్‌స్టాక్స్‌ మినీ 11 పేరుతో ఫ్యూజి ఫిల్మ్‌ కొత్త కెమెరాను లాంచ్‌ చేసింది. ఇన్‌స్టాక్స్‌ మినీ 9కిది కొనసాగింపుగా వస్తోంది. ఇందులో ఆటో ఎక్స్‌పోజర్‌,  మాక్రో మోడ్‌ లాంటి కీలకమైన ఫీచర్లను యాడ్‌ చేశారు. గత కెమెరా కంటే ఇది కాస్త చిన్నదిగా ఉంటుంది. మాక్రో మోడ్‌తో 0.3 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుల్ని చక్కగా ఫొటోలు తీయొచ్చు. గత కెమెరాలో ఉన్న సెల్ఫీ మోడ్‌ను ఇందులో మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. దీని ధర 70 డాలర్లుగా నిర్ణయించారు. ఇదెలా పని చేస్తుందో దిగువ వీడియోలో చూడండి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.