close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120043512 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => UGjlzG3BC78 [video_short_link] => UGjlzG3BC78 [created_by] => [created_date] => [modified_by] => 9823211 [modified_date] => 2020-03-31 20:15:50.168972 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు

1. ఒకేసారి రెండు మొబైల్స్‌లో వాట్సాప్‌

వాట్సాప్‌ను ఒకేసారి ఒక మొబైల్‌లో మాత్రమే వాడగలుగుతున్నాం. అయితే ఒకేసారి రెండు మొబైల్స్‌లో వాడుకునే ఆప్షన్‌ లేదు. టెలిగ్రామ్‌ లాంటి కొన్ని మెసేజింగ్ యాప్స్‌లో ఉన్న ఈ ఆప్షన్‌ను త్వరలో వాట్సాప్‌లోకి తీసుకొస్తున్నారట. ఇప్పటికే ఈ ఫీచర్‌ కొంతమంది వాట్సాప్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందట. ఒక మొబైల్‌లో వాట్సాప్‌ వాడుతూ, మరో మొబైల్‌లో లాగిన్‌ అయితే...  మీ ఎన్‌క్రిప్షన్‌ ఛేంజ్‌ అయ్యిందని ఒక సందేశం వస్తుందట. వాట్సాప్‌ బీటా వెర్షన్‌ 2.20.110లో ఈ ఫీచర్‌ చూడొచ్చని సమాచారం. 


2. హానర్‌ 30 సిరీస్‌ ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌

హానర్‌ ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌లో కొత్త ఫోన్లు రావడానికి రంగం సిద్ధమైంది. ఏప్రిల్‌ 15న హానర్‌ 30, 30 ప్రో మొబైల్స్‌ను చైనాలో లాంచ్‌ చేస్తున్నట్లు సంస్థ తన వీబో అకౌంట్‌లో తెలిపింది. ఈ మొబైల్ బ్రాండ్‌ అంబాసిడర్‌, ప్రముఖ చైనీస్‌ నటుడు లి షాన్‌ హానర్‌ 30 మొబైల్‌ పట్టుకున్న ఫొటోను షేర్‌ చేశారు. హానర్‌ 30 సిరీస్‌లో ఇప్పటికే హానర్‌ 30ఎస్‌ విడుదలైంది. అందులో కిరిన్‌ 820 5జీ ప్రాసెసర్‌ ఉంది. హానర్‌ 30, హానర్‌ 30 ప్రోలో కిరిన్‌ 990 5జీ చిప్‌సెట్‌ ఉండబోతోంది. 


3. వన్‌ ప్లస్‌ వచ్చేది ఏప్రిల్‌ 14న

వన్‌ప్లస్‌ నుంచి ఏప్రిల్‌ 14న కొత్త మొబైల్స్‌ రాబోతున్నాయి. వన్‌ప్లస్‌ 8, వన్‌ప్లస్‌ 8 ప్రో పేరుతో ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌ మొబైల్‌ ఆ రోజు తీసుకురాబోతున్నారు. వీటిలో 120 హెడ్జ్‌ రీఫ్రెష్‌ రేటుతో డిస్‌ప్లే ఉండబోతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ ఉండబోతోంది. ఫ్రంట్‌ సైడ్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. వెనుకవైపు వన్‌ప్లస్‌ 8లో మూడు కెమెరాలు, 8ప్రోలో నాలుగు కెమెరాలు ఉంటాయి. ఈ రెండు మొబైల్స్‌తోపాటు వన్‌ప్లస్‌ 8 లైట్‌ అని ఒక మిడ్‌  రేంజ్‌ మొబైల్‌ తీసుకొస్తారట. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 700 సిరీస్‌ ప్రాసెసర్‌ ఉంటుందని సమాచారం. దీనిని భారత్‌లో వన్‌ప్లస్ జెడ్‌ పేరుతో తీసుకొస్తారని సమాచారం. 


4. మైక్రోసాఫ్ట్‌ న్యూస్‌ బార్‌ ఇలా ఉంటుంది..

కంప్యూటర్‌లో ఏదో పని చేసుకుంటూ... ఎప్పటికప్పుడు తాజా వార్తలు చూసుకునే ఆప్షన్‌ ఉంటే బాగుంటుంది అనిపిస్తోందా? అయితే మీ లాంటి వారి కోసం మైక్రోసాఫ్ట్‌ ఓ ఆప్షన్‌ తీసుకొచ్చింది. ‘మైక్రోసాఫ్ట్‌ న్యూస్‌ బార్‌’ పేరుతో ఈ డెస్క్‌టాప్‌ యాప్‌ ప్రస్తుతం విదేశాల్లో అందుబాటులోకి బీటా వెర్షన్‌లో వచ్చింది. త్వరలో మన దేశంలోనూ చూడొచ్చు. సిస్టమ్‌లో టాస్క్‌ బార్‌ తరహాలోనే ఇదీ ఉంటుంది. ఎలా పని చేస్తుందనేది దిగువ ట్వీట్‌ వీడియోలో చూడొచ్చు. 


5. జూమ్‌ టు ఫేస్‌బుక్‌... నిజమా?

దేశంలో  లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఓ యాప్‌ వాట్సాప్‌, టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను వెనక్కినెట్టేసింది.  ఇటీవల కాలంలో దేశంలో డౌన్‌లోడ్‌ అయిన యాప్స్‌లో జూమ్‌ తొలి స్థానంలో నిలిచింది. అయితే ఈ యాప్‌లోని కంటెంట్‌ ఫేస్‌బుక్‌కి వెళ్తోందని వార్తలొచ్చాయి. ఐవోఎస్‌ వెర్షన్‌ వాడుతున్నవాళ్లకు మాత్రమే ఈ ఇబ్బంది కలుగుతోందట.  అయితే ఈ ఇబ్బందిని ఫిక్స్‌ చేస్తూ జూమ్ కొత్త అప్‌డేట్‌ను రిలీజ్‌ చేసింది. కాబట్టి ఐవోఎస్‌ వెర్షన్‌ వాడే  జూమ్‌ వినియోగదారులు వెంటనే యాప్‌ అప్‌డేట్ చేసుకోవడం మంచిది.


6. కొత్త రెడ్‌మీ ఫోన్‌ వస్తోంది.. 5జీతో

షావోమీ నుంచి మరో 5 జీ మొబైల్‌ రాబోతోందా? అవుననే అంటున్నాయి చైనా టెక్‌ వర్గాలు. M2002J9E కోడ్‌ నేమ్‌తో ఓ రెడ్‌మీ మొబైల్‌  లిస్టింగ్‌ అయ్యింది. ఇది 5జీ నెట్‌వర్క్‌తో రాబోతోంది. ఇందులో 22.5 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉంటుంది.  చైనా కరెన్సీ మన రూపాయల్లో చూస్తే ఈ మొబైల్ ₹10 వేల రేంజ్‌లో ఉండబోతోందని సమాచారం.  అంటే షావోమీ నుంచి రాబోతున్న తొలి బడ్జెట్‌ 5జీ ఫోన్‌ ఇదే అవుతుంది. మరి దీనికి షావోమీ ఏ పేరు పెడుతుందో చూడాలి. 


7. ఈసారి గూగుల్‌ ఏప్రిల్‌ ఫూల్‌ అనదు

ఏటా ఏప్రిల్ 1న గూగుల్‌లో ఏప్రిల్ ఫూల్ జోక్స్‌ విడుదల చేస్తూ ఉంటుంది.  కానీ ఈ ఏడాది గూగుల్‌ ఈ పనిని మానుకుంది. కారణం కరోనా (కొవిడ్‌ - 19) వైరస్‌. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాది గూగుల్‌ నుంచి ఫూల్స్‌ జోక్స్‌ ఉండవు అని తెలుస్తోంది. ఆ సమయాన్ని కొవిడ్‌ - 19పై పోరాటం కోసం వినియోగించుకుంటారట. 2000లో ఏప్రిల్‌ ఫూల్స్‌ జోక్స్‌ ని ప్రారంభించిన గూగుల్‌... 2005 నుంచి ఇప్పటివరకు కొనసాగిస్తోంది. 


8. మెసెంజర్‌లో ఆటో స్టేటస్‌

వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టడం మీకు  తెలిసుంటుంది... ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టొచ్చనీ మీకు తెలుసు. అలా ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లోనూ స్టేటస్‌లు పెట్టొచ్చు. అందులోనూ ఆటో స్టేటస్‌లు పెట్టొచ్చు. అంటే మీరు ఏ రెస్టరెంట్‌కో, సినిమాకు వెళ్తే... మెసెంజర్‌ ఓపెన్‌ చెయ్యాగానే ఆ స్టేటస్‌ రెడీ టు పబ్లిష్‌గా ఉంటుంది. అయితే ఆ రెస్టరెంట్‌ పేరు, సినిమా పేరు స్టేటస్‌లో రాదు. ఇలాంటి ఫీచర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ థ్రెడ్స్‌ యాప్‌లో ఉంది. ఇదే తరహా ఆప్షన్‌ త్వరలో వాట్సాప్‌లో కూడా తీసుకొస్తారని తెలుస్తోంది. అయితే ఇదంతా మీరు మొబైల్‌లో జీపీఎస్‌ ఎప్పుడూ ఆన్‌లో పెట్టుకుంటేనే వస్తుందట.


9. ఓటీటీ ఆగ్రిగేటర్‌ మన దేశంలో...

రకరకాల వెబ్‌సైట్ల వార్తలను ఒకే చోట చూపించే యాప్‌/వెబ్‌సైట్‌ను ఆగ్రిగేటర్‌ అంటున్నాం.  ఓటీటీ వీడియో ప్లాట్‌ఫామ్‌ల కోసమూ ఓ ఆగ్రిగేటర్‌ ఉంది. అదే ఫ్లిక్స్‌జినీ. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో పని చేసే ఈ సర్వీసు ఇప్పుడు మన దేశంలోకి లాంచ్‌ అయ్యింది. ఇందులో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, హూక్‌, ఆల్ట్‌ బాలాజీ,  హాట్‌స్టార్‌లోని వీడియోలు, షోలు, సినిమాలు ఇందులో ఉంటాయి.  వాటిని చూడాలంటే ఆయా ఓటీటీల మెంబర్‌ షిప్‌ ఉండాలి.  మరి ఈ వెబ్‌సైట్‌ ప్రత్యేకత ఏంటనేదేగా.. ఇందులో జినీ స్కోరు, క్రిటిక్స్‌ స్కోరు, బాక్సాఫీసు వసూళ్లు లాంటి అదనపు వివరాలు ఉంటాయి. 


10. మైక్రోసాఫ్ట్‌ నుంచి గ్రామర్లీకి పోటీగా...

ఇంగ్లిష్‌ మేటర్‌లో  అక్షర, వాక్య నిర్మాణ దోషాలను  గుర్తపట్టడానికి గ్రామర్లీ ఉపయుక్తంగా ఉంటుంది. ఈ సర్వీసుకు పోటీగా మైక్రోసాఫ్ట్‌ ఓ కొత్త సర్వీసును తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్‌ ఎడిటర్‌ పేరుతో వచ్చిన ఈ సర్వీసు ఎడ్జ్‌, క్రోమ్‌ బ్రౌజర్‌లకు సపోర్టు చేస్తుంది. ఎలా పని చేస్తుందనేది తెలయజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. మీరూ చూడండి. 

 Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.