CREDAI: క్రెడాయ్‌ నూతన కార్యవర్గమిదే - telugu news credai new body for 2021-23
close

Published : 15/07/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CREDAI: క్రెడాయ్‌ నూతన కార్యవర్గమిదే

హైదరాబాద్‌: క్రెడాయ్‌ హైదరాబాద్‌ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. 2021-23 ఏడాదికి గానూ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు క్రెడాయ్‌ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా పి.రామకృష్ణారావు తిరిగి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా జి.ఆనంద్‌రెడ్డి, కంచం రాజేశ్వర్‌, ఎన్‌.జయదీప్‌ రెడ్డి, బి. జగన్నాథరావు, ప్రధాన కార్యదర్శిగా వి. రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారిగా ఆదిత్య గౌరాను ఎన్నుకున్నారు. 

సంయుక్త కార్యదర్శులుగా కె.రాంబాబు, శివాజీ ఠాకూర్.. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్లుగా బి.ప్రదీప్‌రెడ్డి, ఎం.సతీష్‌కుమార్‌, జి.నితీశ్‌రెడ్డి, సంజయ్‌కుమార్ బన్సల్‌, ఎ.శ్రీనివాస్‌, కె.క్రాంతికిరణ్‌ రెడ్డి, ఎన్‌.వంశీధర్‌రెడ్డి, శ్రీరామ్‌ ముసునూరులను ఎన్నుకున్నట్లు చెప్పారు.  ఆగస్ట్‌ 13, 14, 15 తేదీల్లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు క్రెడాయ్‌ అధ్యక్షుడు రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని