10 కోట్ల క్రెడిట్‌‌, డెబిట్‌ కార్డుల డేటా లీక్‌.. - ten crore credit debit card data leaked
close

Published : 04/01/2021 21:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

10 కోట్ల క్రెడిట్‌‌, డెబిట్‌ కార్డుల డేటా లీక్‌..

డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి ఉంచిన హ్యాకర్స్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా పదికోట్ల మంది వినియోగదారుల డెబిట్‌, క్రెడిట్ కార్డ్‌ల వివరాలు లీక్‌ అయ్యాయి. కార్డ్‌లకు సంబంధించిన డేటాను హ్యాకర్స్‌ డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకుడు ఒకరు వెల్లడించారు. ఇందులో ఖాతాదారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ వివరాలతో పాటు కార్డ్‌ ఎక్స్‌పైరీ తేదీ, మొదటి, చివరి నాలుగు నంబర్ల వివరాలు కూడా ఉన్నాయని సమాచారం. వీటిలో భారతీయుల వివరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఖాతాదారుల వివరాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అమెజాన్‌, మేక్‌ మై ట్రిప్‌, స్విగ్గి వంటి సంస్థలు నగదు చెల్లింపుల కోసం ఉపయోగించే జస్‌పే పేమెంట్ ఫ్లాట్‌ఫాం నుంచి హ్యాకర్స్‌ ఈ డేటాను చేజిక్కించుకున్నట్లు ఆయన వెల్లడించారు.   

హ్యాకర్స్‌ ఈ డేటా మొత్తాన్ని జస్‌పే పేరుతో డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉంచారట. అయితే డేటా లీక్‌పై జస్‌పే సంస్థ స్పందించింది. ఆగస్టు 18 తేదీన కంపెనీ వినియోగదారులకు సంబంధించిన కార్డ్ వివరాలు దొంగిలించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించామని తెలిపింది. కానీ తమ వినియోగదారుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి సమాచారం లీక్ అవ్వలేదని, కేవలం మాస్క్‌డ్‌ కార్డ్స్‌ వివరాలు మాత్రమే హ్యాకర్స్‌ వద్ద ఉన్నట్లు పేర్కొంది. వాటితో ఎలాంటి ప్రమాదం లేదని కంపెనీ ప్రకటించింది. అయితే కంపెనీ వాదనను సైబర్ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. మొదటి, చివరి నాలుగు నంబర్ల ద్వారా అల్గారిథమ్‌ సహాయంతో పూర్తి కార్డు వివరాలు పొందే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే పది కోట్ల మంది ఖాతాదారుల వివరాలు హ్యాకర్స్‌ చేతిలో ఉన్నట్లేనని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇవీ చదవండి..

పిల్లలపై సైబర్‌ వల.. జాగ్రత్తలు ఇలా..!

గూగుల్ ఉద్యోగికి ఫేస్‌బుక్‌ గిఫ్ట్‌..ఎందుకో తెలుసా!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని