యూపీఐ సేవలు నిలిపేయనున్న ట్రూకాలర్‌ - true caller to shut upi services in india
close

Published : 08/03/2021 22:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీఐ సేవలు నిలిపేయనున్న ట్రూకాలర్‌

బెంగళూరు: నాలుగేళ్ల క్రితం కాలర్‌ ఐడీ అప్లికేషన్‌ ట్రూకాలర్‌లో ప్రవేశపెట్టిన యూపీఐ సేవలు ఇకపై భారత్‌లో నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ట్రూకాలర్‌ ప్రతినిధులు సోమవారం వెల్లడించారు. దేశంలో ట్రూకాలర్‌ పే పేరుతో ట్రూకాలర్‌ యూపీఐ చెల్లింపులు నిర్వహిస్తోంది. ట్రూకాలర్‌ యాప్‌ను వినియోగదారులకు మరింత మెరుగ్గా అందించేందుకు ఈ సేవలను నిలిపేస్తున్నట్లు ట్రూకాలర్‌ ప్రతినిధులు వెల్లడించారు. కమ్యునికేషన్‌, భద్రత సంబంధిత అంశాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు వినియోగదారులకు రెండు వారాల క్రితం నోటీసును ఇచ్చామని వారు పేర్కొన్నారు. ఇప్పటికే యూపీఐ చెల్లింపులకు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో తమ యాప్‌ ద్వారా భద్రత, కమ్యునికేషన్‌ను అందిస్తామని తెలిపారు. 2020 మధ్యకాలంలో ట్రూకాలర్‌ పేలో 20 మిలియన్ల యూపీఐ అకౌంట్లు ఉన్నాయి. ఐసీఐసీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకులకు ఇది అనుసంధానమై ఉంది.

ట్రూకాలర్‌ తాజాగా గార్డియన్‌ అనే సేఫ్టీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో గార్డియన్స్‌గా కొందరిని ఎంచుకొని  మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందేలా చేయొచ్చు. వారికి లొకేషన్‌ పంపడంతో వారు మన కదలికల్ని గుర్తించగలుగుతారు. ఎప్పుడైనా ప్రమాదకర పరిస్థితుల్లోపడినపుడు ఐ నీడ్‌ హెల్ప్‌ అన్న ఆప్షన్‌ను నొక్కితే చాలు. గార్డియన్లు గుర్తించి అప్రమత్తమవుతారు.

ఇవీ చదవండి..

86శాతం కేసులు ఆరు రాష్ట్రాల నుంచే

భారత్‌ విజయాలు ప్రపంచానికి చాటాలి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని