ఉద్యోగులకు టీకా..టీవీఎస్‌ కీలక ప్రకటన! - tvs motor company to provide free covid19 vaccination to all employees
close

Published : 06/03/2021 20:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగులకు టీకా..టీవీఎస్‌ కీలక ప్రకటన!

బెంగళూరు: తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేసేందుకు అయ్యే ఖర్చును తామే భరించనున్నట్లు ప్రముఖ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ ప్రకటించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఈ భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సంస్థ మానవ వనరుల విభాగం ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడు ఆనంద్‌కృష్ణన్‌ ఈ మేరకు శనివారం ప్రకటన చేశారు.

కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలిచిందని ఆనంద్‌కృష్ణన్‌ తెలిపారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక యాప్‌ రూపకల్పన, డాక్టర్‌-ఆన్‌-కాల్‌, కొవిడ్‌-19పై అవగాహన కార్యక్రమాలు, మానసిక స్థైర్యం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తాజాగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. తొలి విడతలో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి టీకా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగులకు టీకా వేసేందుకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామంటూ ఇప్పటికే పలు సంస్థలు ప్రకటించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఇన్ఫోసిస్‌, యాక్సెంచర్‌ అలా ప్రకటించిన సంస్థల జాబితాలో ఉన్నాయి.

ఇవీ చదవండి..

వారంలో భారీగా కరిగిన మస్క్‌ సంపద!

టెక్‌ నియామకాలు అదిరాయ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని