ఈ సారి బడ్జెట్‌లో ప్రైవేటీకరణ పాలసీ..? - union budget 2021 may unveil pse privatisation policy
close

Published : 28/01/2021 22:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ సారి బడ్జెట్‌లో ప్రైవేటీకరణ పాలసీ..?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం ఆదాయం కోసం ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ తదితర అంశాలపైనే ఎక్కువగా ఆధారపడనుంది. ప్రైవేటీకరణ పాలసీ బ్లూప్రింట్‌ను ఈ సారి ప్రకటించే అవకాశం ఉంది. ఇవి ప్రభుత్వ రంగానికి చెందిన నాన్‌స్ట్రాటజిక్‌ సెక్టార్‌ (వ్యహాత్మకం కానివి)లో వాటికి సంబంధించినవి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బుధవారం జరిగిన కేబినెట్‌ భేటీలో వ్యూహాత్మక, వ్యూహాత్మకం కానీ  ప్రభుత్వ రంగాలను గుర్తించేలా ది న్యూ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజెస్‌పాలసీని ఆమోదించారు. 

జాతీయ, ప్రజా ప్రయోజనాలను తీర్చడంలో కీలకమైన వాటిని వ్యూహాత్మక రంగాల్లోకి చేర్చే అవకాశం ఉంది. మేలో ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ కింద ప్రభుత్వం నాలుగు కంపెనీలను మాత్రమే వ్యూహాత్మక రంగంలోకి తీసుకొని.. మిగిలిన వాటిని ప్రైవేటీకరించే అవకాశం ఉంది. బడ్జెట్‌లో సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేటీకరణపై దృష్టిపెట్టనుంది. ప్రభుత్వ వ్యయాలు పెంచడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషించనున్నాయి. దాదాపు 249 సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఉన్నాయి. వీటి వార్షిక టర్నోవర్‌ రూ.24 లక్షల కోట్లు. వాటి విలువ రూ.12లక్షల కోట్లు. 

ఇవీ చదవండి

బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రాయితీలు..!

వాహనం నడవాలంటే..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని