ఆదాయపన్ను చెల్లింపు దారులకు దక్కని ఊరట - union budget 2021
close

Updated : 01/02/2021 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదాయపన్ను చెల్లింపు దారులకు దక్కని ఊరట

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు ఐటీ రిటర్న్‌ దాఖలుకు మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను, వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్‌ దాఖలు నుంచి మినహాయింపు లభించనుంది. ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పన్ను చెల్లింపు దారులను కేంద్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది.

 పన్ను వివాదాల నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.50లక్షల లోపు ఆదాయం, రూ.10లక్షల లోపు వివాదాలు ఉన్నవారు నేరుగా కమిటీకి అప్పీల్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆదాయపన్ను చెల్లింపు దారుల సంఖ్య 6.48 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్ను వివాదాల స్పందన కాలపరిమితి  6 నుంచి మూడేళ్లకు తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

 

 

ఇవీ చదవండి...
కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రూ. 35వేల కోట్లు

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని