కేంద్ర బడ్జెట్‌: వైద్యరంగానికి ప్రత్యేక నిధి ఏర్పాటు! - union budget may see separate fund for health sect
close

Published : 12/01/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్ర బడ్జెట్‌: వైద్యరంగానికి ప్రత్యేక నిధి ఏర్పాటు!

కరోనా మహమ్మారి కారణంగానే..

దిల్లీ: ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి..వైద్య రంగంలోని లోటుపాట్లను ఎత్తిచూపింది. ఈ  పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రానున్న వార్షిక బడ్జెట్‌లో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వైద్యరంగానికి విడిగా నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. దానిని ప్రధానమంత్రి స్వాస్థ్‌ సంవర్ధన్ నిధి పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. 

వైద్యరంగంలో ఎదురయ్యే విపత్తులను ఎదుర్కొని, నిలబడేందుకు బడ్జెట్ కేటాయింపులకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దానిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి స్వాస్థ్‌ సంవర్ధన్ నిధి కింద ఇచ్చే నిధిని ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా వాడకున్నా తిరిగి అలాగే కొనసాగించేలా రూపొందించినట్లు సమాచారం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం..ఆదాయ పన్ను, కార్పొరేట్‌ పన్నుపై విధించే విద్య, ఆరోగ్య సెస్‌ వసూళ్లలో 25శాతాన్ని దీనికి కేటాయించనున్నారు. ఈ నిధులను ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు, ప్రధాన మంత్రి స్వాస్థ సురక్షా యోజన పథకాలకు వినియోగించనున్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం అదనపు నిధుల లభ్యతకు ఈ నిధి ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయం. కాగా, ప్రస్తుతం జీడీపీలో 1.4 శాతంగా ఉన్న వైద్య రంగ వ్యయాన్ని 2024 నాటికి 4శాతానికి పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం విధించుకున్న లక్ష్యానికి ఇది దోహదం చేయనుంది. 

ఇవీ చదవండి:

హెర్డ్ ఇమ్యూనిటీ ఈ ఏడాది అసాధ్యమే!

కరోనా కేసుల్లో భారీ తగ్గుదల 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని