బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం - union cabinet approves central budget
close

Published : 01/02/2021 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కాసేపట్లో లోక్‌సభలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. దేశాన్ని అన్ని రంగాల్లో సొంతకాళ్లపై నిలబడేలా చేయాలన్న లక్ష్యంతో ఈ బడ్జెట్‌ తీసుకురాబోతున్నట్లు అంచనా.  కరోనా కారణంగా వివిధ సహాయాలు ప్రకటిస్తూ మినీ బడ్జెట్‌ల పరంపర కొనసాగిందని, దానికి కొనసాగింపుగా బడ్జెట్‌ ఉంటుందని ప్రధాని పార్లమెంటు సమావేశాల తొలిరోజు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇందులో అందరికీ ఊరటనిచ్చే అంశాలు ఉండనున్నాయి. అంతకు ముందు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రామ్‌నాథ్‌కోవింద్‌ను కలిశారు.

ఇవీ చదవండి...

బడ్జెట్‌ ‘ట్యాబ్‌‌‌’తో నిర్మలమ్మ

స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ జోష్‌!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని