ఫావిపిరవిర్‌ తయారీకి వివిమెడ్‌ అనుమతి - vivimed labs gets dghs nod to manufacture favipiravir
close

Published : 10/05/2021 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫావిపిరవిర్‌ తయారీకి వివిమెడ్‌ అనుమతి

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా చికిత్సలో వినియోగించే యాంటీ వైరల్‌ ఔషధం ఫావిపిరవిర్‌ తయారీకి హైదరాబాద్‌కు చెందిన మరో ఫార్మా కంపెనీకి అనుమతి లభించింది. ఈ టాబ్లెట్లను 200 ఎంజీ, 400 ఎంజీ రూపంలో తయారు చేయడానికి డీజీహెచ్‌ఎస్‌ నుంచి అనుమతులు వచ్చినట్లు వివిమెడ్‌ కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.  ఈ ఔషధాన్ని కొవిడ్‌లో తేలికపాటి నుంచి మధ్యస్థాయి లక్షణాలు ఉన్న రోగుల చికిత్సకు వినియోగిస్తున్నారు. దీనిని ‘ఫావులౌస్‌’ పేరుతో విక్రయించనుంది. 

దేశ వ్యాప్తంగా నోటిద్వారా తీసుకొనే యాంటీవైరల్‌ ఔషధంగా దీనిని వాడుతున్నారు. దీనిపై కంపెనీ సీఈవో రమేష్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ .. ‘ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో వైద్యులకు చాలా  ఆప్షన్లు అవసరం. ఈ నేపథ్యంలో మేము తయారు చేసిన ‘ఫావులౌస్‌’ టాబ్లెట్లను మార్కెట్లో అందుబాటు ధరల్లో తీసుకొస్తాము. ఇది రోగులకు ఆరోగ్యం  అందివ్వడంతో పాటు.. వారిపై ఆర్థిక భారాన్ని కచ్చితంగా తగ్గిస్తుంది’ అని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వాలు, మెడికల్‌ విభాగాలతో కలిసి తాము పనిచేస్తున్నామని.. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని