బడ్జెట్‌లో సగటు జీవి సంగతేంటో..! - what the common man wants from budget 2021
close

Updated : 29/01/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌లో సగటు జీవి సంగతేంటో..!

 నిర్మలమ్మపై సామాన్యుడి ఆశలు

ఇంటర్నెట్‌డెస్క్‌ : ‘ఎన్నడూ చూడనటువంటి బడ్జెట్‌’ అంటూ గత నెల నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు సామాన్యుడిలో ఆశలు పెంచాయి. ఆదాయపు పన్ను కచ్చితంగా చెల్లించే వేతన జీవులే ఈ వర్గంలో ఎక్కువగా ఉంటారు. వారి ఆశలు కేవలం చిన్న రాయితీలు.. మినహాయింపుల పైనే ఉంటాయి. ఆదాయపు పన్ను, ఆరోగ్య బీమా, గృహ రుణాల చెల్లింపుపై రాయితీ వంటివి మాత్రమే వారికి ఎక్కువగా రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఈ సారి చాలా మంది వేతనాలు తగ్గడం, ఉద్యోగాలు పోవడంతో బడ్జెట్‌లో వచ్చే చిన్న రాయితీ అయినా వారికి కచ్చితంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

మరిన్ని మినహాయింపులు.. రాయితీలు

గతేడాది ఆదాయపు పన్ను విధానంలో మార్పులు తీసుకొచ్చారు. కొత్త పన్ను విధానాన్ని కూడా ఆప్షన్‌గా ఇచ్చారు. పన్ను చెల్లంపుదారులు దేనిలో ఎక్కువ లబ్ధి ఉంటే దానిని ఎన్నుకున్నారు. కానీ, అది స్వల్ప మొత్తంలోనే లబ్ధి చేకూర్చింది. కానీ, ఇప్పుడు స్వల్ప మొత్తం లబ్ధితో బండి నడిచే పరిస్థితి లేదు. వివిధ రకాల పెట్టుబడుల్లో నిధులను ఉంచడం వల్ల లభించే సెక్షన్‌ 80సీ మొత్తాన్ని రూ.1.5లక్షల నుంచి మరింత పెంచాల్సి ఉంది. వాస్తవానికి దీనిని సవరించి కూడా కొన్నేళ్లవుతోంది. అందుకే దీనిని రూ.2.5 లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచాలని కోరుతున్నారు. లేకపోతే ఆదాయాన్ని బట్టి సెక్షన్‌80సీ పరిధి వర్తించేలా చూడాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి.  అంతేకాదు బీమాలో టర్మ్‌ ప్లాన్లు తీసుకోవడాన్ని ప్రోత్సహించేలా సెక్షన్‌ 80సీలో మార్పులు చేయాలి.

ఇళ్ల కొనుగోళ్లపై రాయితీ .. 

ఇప్పటికే ఇళ్ల కొనుగోళ్లపై సెక్షన్‌ 80సీ అండ్‌ సెక్షన్‌ 24బీ కింద మినహాయింపులు అందుతున్నాయి. ప్రభుత్వం గృహ రుణాలపై మూలమొత్తం చెల్లింపులో ఇచ్చే రాయితీని 1.5 లక్షల నుంచి రూ.2.5లక్షలకు పెంచాల్సి ఉంది. ఇది రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా మరింత ఊతం ఇవ్వనుంది.  అంతేకాదు సెక్షన్‌ 24బీ కింద పన్ను పరిధిలోని ఆదాయ తగ్గింపు రూ.5లక్షలకు పెంచాల్సి ఉంది. ముఖ్యంగా మధ్య శ్రేణి, ప్రధాన నగరాల్లోని ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

వారికి వడ్డీ ఆదాయ పరిధి పెంపు

సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ, పింఛన్లు వంటివే ప్రధాన జీవనాధారాలు.  ఈ నేపథ్యంలో వారికి లభించే వడ్డీలో ఎక్కువ మొత్తం పన్ను పరిధిలోకి రాకుండా ఆర్థిక మంత్రి చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం సెక్షన్‌ 8 టీటీబీ కింద రూ.50వేల వడ్డీ ఆదాయం వరకు పన్నులేదు. కానీ, మినహాయింపును కనీసం రూ.లక్ష నుంచి రూ.1.5లక్ష వరకు పెంచాలి.

ఆరోగ్య బీమాపై రాయితీ పెంపు

కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఆసుపత్రుల్లో ఫీజులు ప్రజలను ఎంతగా బాధించాయో ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం నియంత్రణకు ప్రయత్నించినా చాలా చోట్ల అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సెక్షన్‌ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై ఇచ్చే రాయితీని రూ.లక్షకు పెంచాల్సిన అవసరం ఉంది.

వాటాలపై పన్నుల భారం తగ్గింపు..

ఈక్విటీ పెట్టుబడులపై ప్రభుత్వం విధిస్తున్న పన్నులను తగ్గిస్తే రిటైల్‌ ఇన్వెస్టర్లు పెద్దమొత్తంలో లబ్ధి పొందుతారు. ప్రస్తుతం వీటిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 10 శాతం వరకు ఉంటోంది. రూ.లక్షకు మించిన ఆదాయంపై వీటిని విధిస్తున్నారు. ఈ పన్ను తొలగింపు మార్కెట్లలో కూడా జోష్‌ నింపుతుంది. 

ఇవీ చదవండి

బడ్జెట్‌ సంజీవని అవుతుందా?

‘స్మార్ట్‌ స్విచ్‌’ వేయనున్న నిర్మలమ్మ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని