ఏమైంది బంగారం..! - why gold rates going down spl discussion
close

Published : 11/03/2021 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏమైంది బంగారం..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెరగడం తప్ప తగ్గడం తెలియని బంగారం కొంతకాలంగా చిన్నబోతోంది. కరోనా అనంతర పరిణామాల్లో రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు ఊహించని రీతిలో తగ్గుముఖం పడుతున్నాయి. మూడు వారాలుగా నేల చూపులు చూస్తున్న పసిడి సూచీలు కొనుగోలు దారులకు ఆశలు రేపుతుంటే.. ఇప్పటికే కొన్నవారిలో ఈ రేట్లు ఇంకెంతగా క్షీణిస్తాయోనని గుబులు రేపుతున్నాయి.  పెట్టుబడులకు బంగారమే అనువైందని భావించి అత్యధిక ధరల వద్ద కొనుగోలు చేసినవారు ఇప్పుడు డోలాయమానంలో పడ్డారు. అసలు బంగారానికి ఏమైంది? కొనుగోలుదారులకు రానున్న రోజుల్లో పసిడి నమ్మకమైన పెట్టుబడిగా నిలుస్తుందా? లేదా? ఇలా బంగారంపై తలెత్తే ఎన్నో ప్రశ్నలకు ‘ఈటీవీ ప్రతిధ్వని’ చర్చా కార్యక్రమంలో నిపుణులు చెప్పే సమాధానాలు ఈ వీడియోలో చూడండి.మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని