కరోనాలోనూ విస్తరించిన కేఎఫ్‌సీ నెట్‌వర్క్‌! - will continue physical expansion despite COVID-19 disruptions says KFC
close

Published : 28/03/2021 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాలోనూ విస్తరించిన కేఎఫ్‌సీ నెట్‌వర్క్‌!

దిల్లీ : కరోనా కారణంగా రెస్టారెంట్ల వ్యాపారాలు కుదేలవుతున్నప్పటికీ.. అమెరికన్‌ ఫాస్ట్‌ఫుడ్‌ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్‌ చికెన్ (కేఎఫ్‌సీ) మాత్రం భారత్‌లో తమ నెట్‌వర్క్‌ మరింత విస్తరించనున్నామని ప్రకటించింది. రానున్న కొన్నేళ్లలో భారత్‌లో ఈ బిజినెస్‌ వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

కరోనా సంక్షోభం కొనసాగినప్పటికీ భారత్‌లో గత ఏడాది కేఎఫ్‌సీ 30 కొత్త రెస్టారెంట్లను ప్రారంభించింది. వినియోగదారుల తాకిడి గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా మరికొన్ని కొత్త రెస్టారెంట్లను ప్రారంభించాలని యోచిస్తోంది. కేఎఫ్‌సీ బ్రాండ్‌, దాని ఉత్పత్తులను వినియోగదారులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కేఎఫ్‌సీ ఇండియా ఎండీ సమీర్‌ మేనన్‌ తెలిపారు. కరోనా వెలుగులోకి రావడానికి ముందు భారత్‌లో 450 కేఎఫ్‌సీ రెస్టారెంట్లు ఉండేవని తెలిపారు. ప్రస్తుతం అవి 480కి పెరిగినట్లు వెల్లడించారు.

కరోనా సంక్షోభం నేపథ్యంలో మారిన వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఆన్‌లైన్‌ విధానాన్ని మరింత వేగవంతం చేసే దిశగా చర్యలు చేపట్టామని సమీర్‌ తెలిపారు. గత ఏడాది కాలంలో కంపెనీ ఆన్‌లైన్ వ్యాపారం 50 శాతం పెరిగినట్లు వెల్లడించారు. కరోనాకి ముందు మొత్తం వినియోగదారులలో సగం మంది రెస్టారెంట్‌కు నేరుగా వచ్చేవారని.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 70 శాతం పడిపోయిందని తెలిపారు. ఇక రెండో వేవ్‌ విజృంభించి రెస్టారెంట్లు మరోసారి మూతపడే పరిస్థితి వస్తున్న నేపథ్యంలో..  కష్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని