విరాళాలు ఇవ్వడంలోనూ అగ్రస్థానమే - worlds richest person made the single-largest charitable contribution
close

Updated : 05/01/2021 14:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విరాళాలు ఇవ్వడంలోనూ అగ్రస్థానమే

10 బిలియన్ డాలర్లను వితరణగా ఇచ్చిన బెజోస్

కాలిఫోర్నియా: సంపదను కూడబెట్టడమే కాదు..విరాళాలు ఇవ్వడంలోనూ అగ్రస్థానమేనని నిరూపించుకున్నారు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్.  ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న బెజోస్..2020లో 10 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వెచ్చించారు. ఈ వితరణలతో ‘ది క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రపీ’ వార్షిక జాబితాలో ముందు వరసలో నిలిచారు. వాతావరణ మార్పులపై పోరాటానికి ఉద్దేశించి ఈ విరాళాలను అందజేశారు.

ఫోర్బ్స్‌ అంచనాల ప్రకారం..అమెజాన్ వ్యవస్థాపకుడి సంపద 188 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎర్త్ ఫండ్ పేరిట ఆయన అందిస్తోన్న సహకారం..వాతావరణ సంక్షోభంలో చిక్కుకున్న లాభాపేక్షలేని సంస్థలకు మద్దతు ఇస్తోంది. ఎర్త్‌ ఫండ్‌ ద్వారా ఆయన ఇప్పటివరకు 16 గ్రూపులకు 790 మిలియన్ డాలర్ల సహకారం అందించారని క్రానికల్ వెల్లడించింది. అయితే, ఆయన కాకుండా మిగతా టాప్‌ టెన్ వితరణలు 2011తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఈ మొత్తం 2.6 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉందని తెలిపింది. ఆ బిలియనీర్ల సంపద గత సంవత్సరం భారీగా పెరిగినప్పటీకి విరాళాల మొత్తం మాత్రం తగ్గినట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా..నైక్ సహవ్యవస్థాపకుడు ఫిల్ నైట్ 900 మిలియన్ల డాలర్లను నైట్ ఫౌండేషన్‌కు విరాళాలుగా ఇచ్చారు. ఆయన సతీమణి పెన్నీ ఒరిగాన్ యూనివర్సిటీకి 300 మిలియన్ డాలర్లను అందించి జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. అలాగే ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్ బర్గ్, ఆయన సతీమణితో కలిసి 250 మిలియన్ డాలర్లు వితరణల కింద అందజేశారు. 2020 ఎన్నికల్లో భద్రతాపరమైన అంశాలపై పనిచేసిన సెంటర్ ఫర్ టెక్ అండ్ సివిక్ లైఫ్‌కు ఈ మొత్తాన్ని అందించారు. వీరు క్రానికల్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

ఇవీ చదవండి:

జాక్‌మా ఎక్కడ?

కొవాగ్జిన్ టీకా పూర్తిగా సురక్షితం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని