జీవితకాల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం - wpi at its all time high
close

Updated : 17/05/2021 22:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీవితకాల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

దిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) ఏప్రిల్‌లో జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో (మైనస్‌) -1.57 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ఈసారి ఏకంగా 10.49 శాతానికి చేరింది. గతేడాదితో పోలిస్తే చమురు, ఉత్పత్తి ఆధారిత వస్తువుల ధరలు పెరగడమే అందుకు కారణం. డబ్ల్యూపీఐ పెరగడం ఇది వరుసగా నాలుగో నెల.

గత ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. దీంతో చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి. అలాగే ఉత్పత్తి ఆధారిత వస్తువుల గిరాకీ సైతం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ క్రమంలో టోకు ద్రవ్యోల్బణం పూర్తిగా పడిపోయింది. దాన్ని ఆధారంగా చేసుకొని లెక్కించడమే ఈసారి ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరడానికి ప్రధాన కారణం.

దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గుడ్లు, మాంసం, చేపల వంటి ప్రోటీన్ ఆధారిత ఆహార పదార్థాలకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 4.92 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు 9.03 శాతం మేర క్షీణించగా.. గుడ్లు, మాంసం, చేపల ధరలు 10.88 శాతంగా ఎగబాకాయి. ఇక పప్పు దినుసుల ధరలు 10.74 శాతం, పండ్ల ధరలు 27.43 శాతం మేర ప్రియమయ్యాయి. ఇంధన-విద్యుత్తు ద్రవ్యోల్బణం 20.94 శాతం, ఉత్పత్తి ఆధారిత వస్తువుల ద్రవ్యోల్బణం 9.01 శాతంగా నమోదైంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని