పార్టనర్ల ఫీజును పెంచిన జొమాటో - zomato increases delivery partner fee to accommodate fuel price hike
close

Published : 26/02/2021 22:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పార్టనర్ల ఫీజును పెంచిన జొమాటో

ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రకటించిన సంస్థ సీఈవో

దిల్లీ: దేశంలో పెద్దయెత్తున ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ (యాప్‌) జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ డెలివరీ భాగస్వాముల రెమ్యునిరేషన్‌ను పెంచుతున్నట్లు జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో వరుస ట్వీట్లు చేశారు. ‘‘ప్రస్తుతం పెరిగిన ఇంధన ధరలతో మా డెలివరీ పార్టనర్లకు అదనంగా సుమారు ఆరు నుంచి ఎనిమిది వందలు ఖర్చవుతోంది. అది వారి జీతంలో మూడు శాతం. అందుకే రవాణా ఖర్చులను దృష్టిలో పెట్టుకొని వారికి ఇచ్చే రెమ్యునిరేషన్‌ను పెంచాలని నిర్ణయించుకున్నాం. దీన్ని ఇప్పటికే కొన్ని నగరాల్లో ప్రారంభించాం’’ అని దీపిందర్‌ గోయల్‌ తెలిపారు.

ఈ అంశంపై జొమాటో సంస్థ ఒక ప్రకటన చేసింది. ‘‘ పెరిగిన ధరల నేపథ్యంలో మా డెలివరీ పార్టనర్ల జీతం ప్రభావితం కాకుండా ఉండేందుకు దూరాన్ని బట్టి వారికి చెల్లింపులు చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ మార్పు కస్టమర్లపై ఎటువంటి భారం మోపదు. భవిష్యత్తులో ఇంధన ధరల ఆధారంగా దీనిలో మార్పులు చేస్తాం.’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

పర్వతశ్రేణులు.. ఎన్నో అందాలు

లగేజ్‌ లేకపోతే.. విమాన టికెట్‌పై డిస్కౌంట్మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని