Home Loan: రూ.2 కోట్ల వరకు గృహ రుణాలకూ 6.66% వడ్డీయే - LIC HFL offers lowest home loan at 6.66 pc
close

Published : 24/09/2021 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Home Loan: రూ.2 కోట్ల వరకు గృహ రుణాలకూ 6.66% వడ్డీయే

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌

ముంబయి: రూ.2 కోట్ల వరకు గృహ రుణాలు తీసుకునే గృహ కొనుగోలుదార్లకు శుభవార్త. ఇప్పటి వరకు రూ.50 లక్షల్లోపు గృహ రుణాలకు మాత్రమే అందుబాటులో ఉన్న అతి తక్కువ గృహ రుణ రేటు 6.66 శాతాన్నే రూ.2 కోట్ల రుణాల వరకూ వర్తింపజేయనున్నట్లు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌) వెల్లడించింది. ఈ రుణ రేటును గత జులై నుంచి అమల్లోకి తీసుకొచ్చిన ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్, ఈ నెల 22 నుంచి నవంబరు 30 వరకు మంజూరు చేసే గృహ రుణాలకు కూడా వర్తింపజేయనున్నట్లు తెలిపింది. సిబిల్‌ స్కోరు 700 అంత కంటే ఎక్కువ ఉన్న ఖాతాదార్లకు వారి వృత్తితో నిమిత్తం లేకుండా రుణాలు జారీ చేస్తామని కంపెనీ ఎండీ, సీఈఓ వై.విశ్వనాథ గౌడ్‌ వెల్లడించారు.  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని