close

Updated : 01/05/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Home Loan వడ్డీ రేట్లు తగ్గించిన SBI!

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) శుభావార్త అందజేసింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. మహిళా రుణ గ్రహీతలకు మరో ఐదు బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనున్నట్లు తెలిపింది. ఖాతాదారులు యోనో యాప్‌ నుంచి గృహరుణాలను పొందవచ్చునని.. అలా తీసుకున్న వారికి మరో 5 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీరేటును తగ్గిస్తామని తెలిపింది. నేటి నుంచే కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. 

SBI గృహ రుణ వడ్డీ రేట్లు రూ.30 లక్షలకు 6.70 శాతం, రూ.30 లక్షలు నుంచి రూ.75 లక్షల వరకు 6.95 శాతం, రూ.75 లక్షలకుపైగా రుణాలను తీసుకునే వారికి 7.05 శాతం వద్ద గృహ రుణాలు లభిస్తాయని బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ.5 లక్షల కోట్ల మైలు రాయిని ఫిబ్రవరిలోనే చేరిందని.. దీన్ని రానున్న ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.7లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.


ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని