close
ఐటీ షేర్లదే హవా

సూచీలకు అవే మార్గనిర్దేశం చేస్తాయ్‌
ఫలితాలపై మదుపర్ల దృష్టి
బుధ, శుక్రవారాలు మార్కెట్లకు సెలవు
ఔషధ, సిమెంటు షేర్లకు సానుకూలతలు

ఐటీ కంపెనీల షేర్లు ఈ వారం మార్కెట్‌కు మద్దతు పలకవచ్చని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే నెలనెలన్నర రోజుల పాటు ఈ కంపెనీల షేర్లు రాణించే అవకాశం ఉందని ఫెయిర్‌వెల్త్‌ సెక్యూరిటీస్‌ అంటోంది.  ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో రూపాయి బలహీనపడడం, రాజకీయ అనిశ్చితుల కారణంగా ఐటీ షేర్లపై మదుపర్లు మొగ్గుచూపవచ్చన్నది అంచనాగా ఉంది. సోమవారం ఇన్ఫీ షేర్లు 725-730 స్థాయిలకు చేరితే మంచి కొనుగోలు అవకాశమేనని చెబుతున్నారు. విప్రో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఆయా కంపెనీల షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. నిఫ్టీ-50 ఈ వారం 11,460-11,760 మధ్య చలించొచ్చని చెబుతున్నారు. ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రభావం చూపుతాయి. మహావీర్‌ జయంతి, గుడ్‌ఫ్రైడేల సందర్భంగా ఈ వారంలో బుధ, శుక్రవారాలు మార్కెట్లు పనిచేయవు. వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు ఇవీ..

* బ్యాంకింగ్‌ షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలొచ్చు. మదుపర్లు పెద్ద పొజిషన్ల జోలికి వెళ్లకపోవచ్చు. ఫలితాల నేపథ్యంలో ఎంపిక చేసిన బ్యాంకు షేర్లలో కదలికలను అంచనా వేయొచ్చు. ఎన్నికల సరళి కూడా ప్రభావం చూపొచ్చు. దిద్దుబాటుకు గురైన ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు కనిపించవచ్చు. ఫలితాలు బాగుండొచ్చన్న అంచనాలు ఇందుకు నేపథ్యం.
* అంచనాల కంటే తక్కువగా ఆదాయ అంచనా (7.5-9.5%)లను ప్రకటించడంతో సోమవారం ఇన్ఫీ షేర్లు నష్టపోవచ్చు. అయితే టీసీఎస్‌ షేర్లు మాత్రం స్తబ్దుగా కనిపించవచ్చు. విప్రో, మైండ్‌ ట్రీలు వరుసగా మంగళ, బుధవారాల్లో ఫలితాలు ప్రకటించనున్నందున వాటి షేర్లు వెలుగులోకి రావొచ్చు.
* వాహన షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడవచ్చు. గత 3 నెలల్లో కమొడిటీ ధరలు పెరగడం వల్ల మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్‌ లాభం తగ్గొచ్చు.
* 2018 ఫిబ్రవరిలో 16.6% వృద్ధి చెందిన యంత్రపరికరాల సూచీ ఈఏడాది ఫిబ్రవరిలో 8.8 శాతం క్షీణించింది. రూపాయి క్షీణత ఈ రంగ ఫలితాలు, షేర్లపై ప్రభావం చూపొచ్చు.ఎల్‌ అండ్‌ టీ, భెల్‌లకు ఆర్డర్లు రావడం సానుకూలాంశం.
* హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీఎల్‌ల వంటి డౌన్‌స్ట్రీమ్‌ కంపెనీలు ప్రతికూల ధోరణిలో; అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు సానుకూలంగా కదలాడవచ్చు. అంతర్జాతీయ ముడి చమురు ధరలను మదుపర్లు సునిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.
* టెలికాం కంపెనీల షేర్లు తక్కువ శ్రేణిలో చలించొచ్చు. రిలయన్స్‌ జియో ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. వినియోగదారు సగటు ఆదాయం; కొత్త వినియోగదార్ల సంఖ్యతో పాటు కంపెనీ ఫైబర్‌ బ్రాడ్‌బ్రాండ్‌ సేవల కార్యకలాపాలపై చేసే ప్రకటన, వ్యూహాలను  మదుపర్లు గమనించొచ్చు.
* ఔషధ కంపెనీల షేర్లు తమ లాభాలను కొనసాగించొచ్చు. ఈ రంగ కంపెనీలు బలమైన ఫలితాలను ప్రకటిస్తాయన్న అంచనాలు ఇందుకు నేపథ్యం. అమెరికా జనరిక్‌ మార్కెట్లో స్థిరత్వం వల్ల ఈ సారి ఫలితాలు మెరుగ్గా ఉండొచ్చు.
* మౌలిక, మెట్రో రైలు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల కారణంగా సిమెంటుకు గిరాకీ పెరుగుతోంది. ఏసీసీ, అల్ట్రాటెక్‌ సిమెంటులు ఈ నెల 23, 24న ఫలితాలు ప్రకటించనున్నాయి.
* ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు ఈ వారం రాణించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వర్షాలు బాగుంటే గ్రామీణ వ్యయాలు పెరుగుతాయి. విక్రయాలపై అధికంగా ఆధారపడే ఈ రంగ కంపెనీలకు సానుకూలాంశం.
* లోహ, గనుల కంపెనీల షేర్లలో ట్రేడింగ్‌ విషయంలో మదుపర్లు జాగ్రత్త వహించే అవకాశం ఉంది. అయితే మార్కెట్‌తో పాటు ఇవీ సానుకూలతలను ప్రదర్శించే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఇటీవల ధరల పెంపు కారణంగా ఉక్కు కంపెనీల్లో సానుకూలతలు కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.