Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114335
            [news_title_telugu_html] => 

సిమెంటుకు సరైన సమయమే!

[news_title_telugu] => సిమెంటుకు సరైన సమయమే! [news_title_english] => [news_short_description] => జనవరి- మార్చి త్రైమాసిక ఫలితాల సీజను ముగింపునకు వచ్చేసింది. ఇప్పటివరకు ఆయా రంగాల కంపెనీలు ప్రకటించిన ఫలితాలు మిశ్రమంగానే ఉన్నాయి. కొన్నైతే అంచనాలను కూడా అందుకోకుండా నిరుత్సాహపర్చాయి. మరికొన్ని భవిష్యత్‌పై ఆందోళనకర అంచనాలను వెలిబుచ్చాయి. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,1, ) )
సిమెంటుకు సరైన సమయమే! - EENADU
close
సిమెంటుకు సరైన సమయమే!

జనవరి- మార్చిలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కంపెనీలు
అధిక డిమాండు, ధరతో మున్ముందూ సానుకూలతలే
షేర్ల కొనుగోలుకు బ్రోకరేజీల సిఫారసు

జనవరి- మార్చి త్రైమాసిక ఫలితాల సీజను ముగింపునకు వచ్చేసింది. ఇప్పటివరకు ఆయా రంగాల కంపెనీలు ప్రకటించిన ఫలితాలు మిశ్రమంగానే ఉన్నాయి. కొన్నైతే అంచనాలను కూడా అందుకోకుండా నిరుత్సాహపర్చాయి. మరికొన్ని భవిష్యత్‌పై ఆందోళనకర అంచనాలను వెలిబుచ్చాయి. అయితే సిమెంటు రంగ కంపెనీల ఫలితాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, అంబుజా సిమెంట్స్‌, ఓరియంట్‌ సిమెంట్‌, స్టార్‌ సిమెంట్‌, ప్రిజమ్‌ జాన్సన్‌ లాంటి ప్రముఖ కంపెనీలు మెరుగైన ప్రదర్శనను కనబర్చాయి. ధరల పెంపు, అధిక గిరాకీ లాంటివి కంపెనీల మెరుగైన పనితీరుకు తోడ్పడ్డాయి.

మరి ఈ ఫలితాలను చూసి సిమెంటు రంగ షేర్లను కొనుగోలు చేయొచ్చా? సిమెంటు షేర్లు కొనడానికి ఇది సరైన సమయమేనా? విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థలు ఏమంటున్నాయి?
2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం సిమెంటు రంగ కంపెనీల పనితీరు నెమ్మదించింది. నిధుల కొరత కారణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం పడటమే ఇందుకు కారణం. దీంతో అప్పటినుంచి సిమెంటు రంగ షేర్లు పేలవ ప్రదర్శనను కనబర్చాయి. ఓ వైపు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ రాణించినా.. ఈ రంగ షేర్లు మాత్రం నష్టాలనే పంచాయి. అయితే మౌలిక రంగానికి, అందుబాటు గృహ నిర్మాణ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం పెంచడంతో సిమెంటుకు గిరాకీ పుంజుకోవడం మొదలైంది. ఇటీవల సిమెంటు ధర కూడా పెరగడంతో కంపెనీల లాభదాయకత కూడా మెరుగయ్యింది. ఇదే జనవరి- మార్చి త్రైమాసిక ఫలితాల్లో కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు. మున్ముందూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. అందువల్ల సిమెంటు షేర్ల విషయంలో సానుకూల దృక్పథంతో ఉండొచ్చని.. పెట్టుబడులు పెట్టడమూ లాభదాయకమేనని సిఫారసు చేస్తున్నారు. పైగా గత రెండేళ్లలో షేర్ల విలువలు దిగిరావడంతోనూ ఈ షేర్ల ధర ఆకర్షణీయంగా మారిందని అంటున్నారు.

ఇవి కలిసిరావచ్చు..

సిమెంటుకు గిరాకీ పెరిగేందుకు ఈ కింది అంశాలు దోహదం చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
* మౌలిక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేయడం
* ‘ప్రతి ఒక్కరికీ ఇల్లు’ పథకం అమలు
* గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు పెరగడం
* గ్రామీణ ప్రాంతంలో పక్కా ఇళ్ల నిర్మాణం
* సామర్థ్య వినియోగం మెరగవడం

ఎవరెవరు.. వేటివేటికి
ఆయా సిమెంటు రంగాల కంపెనీల పనితీరుపై బ్రోకరేజీ సంస్థల విశ్లేషణ, షేర్ల సిఫారసులు ఇలా..

ఏసీసీ
లక్ష్యం: రూ.1735 (ప్రభుదాస్‌ లీలాధర్‌)

ఏసీసీకి కీలక విపణులైన మధ్య ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఒడిశాలో అధిక సిమెంటు ధరల ధోరణి కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల కంపెనీ మెరుగైన లాభదాయకతను నమోదుచేయొచ్చు. అలాగే ఆకర్షణీయమైన వ్యాల్యూయేషన్లకు తోడు కార్యకలాపాల నాణ్యత మెరుగపడటం కంపెనీ షేరుకు కలిసిరావచ్చు. అందువల్ల రూ.1,735 లక్ష్యంతో షేరను కొనుగోలు చేయొచ్చని ప్రభుదాస్‌ లీలాధర్‌ విశ్లేషకులు సిఫారసు చేస్తున్నారు.

అల్ట్రాటెక్‌ సిమెంట్‌
లక్ష్యం: రూ.5140 (హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌) రూ.5,190 (మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌)

ఫలితాల సమీక్ష, అధిక డిమాండు, అధిక ధర, తక్కువ ఇంధన వ్యయాలు, వ్యయ నియంత్రణను మెరుగుపర్చుకోవడం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అల్ట్రాటెక్‌ షేరుకు ‘కొనుగోలు’ సిఫారసును హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కొనసాగించింది. రూ.5,140 లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే సెంచురీ టెక్స్‌టైల్స్‌ సిమెంటు వ్యాపారం కొనుగోలులో ఆలస్యం, సిమెంటు ధరల తగ్గుముఖం, ఇంధన వ్యయాలు పెరగడం లాంటివి కంపెనీ పనితీరుకు కీలక సవాళ్లుగా నిలిచే అవకాశం ఉంది. మోతీలాల్‌ ఓస్వాల్‌ కూడా రూ.5,190 లక్ష్యంతో అల్ట్రాటెక్‌ సిమెంటు షేరును కొనుగోలు చేయొచ్చని సిఫారసు చేసింది.

ఓరియంట్‌ సిమెంట్‌
లక్ష్యం: 150 (ఎలారా కేపిటల్‌)

2018-19 నాలుగో త్రైమాసికంలో ఓరియంట్‌ సిమెంటు లాభం నాలుగు రెట్లు పెరిగి రూ.61.98 కోట్లకు చేరింది. నికర విక్రయాలు 21 శాతం వృద్ధితో రూ.750 కోట్లుగా నమోదైంది. అమ్మకాలు విశ్లేషకుల అంచనాను మించడం గమనార్హం. కీలకంగా ఉన్న విపణుల్లో సిమెంటు ధరలు పెరగడం, సమీపకాలంలో సుస్థిర పనితీరును కనబర్చే అవకాశం ఉండటంతో కంపెనీ షేరు కొనుగోలుకు ఎలారా కేపిటల్‌ సిఫారసు చేస్తోంది. షేరు లక్ష్యాన్ని రూ.80 నుంచి రూ.150కి పెంచింది.

స్టార్‌ సిమెంట్‌
లక్ష్యం: రూ.135 (ఆనంద్‌ రాఠీ ఫైనాన్షియల్‌)

అధిక వ్యయాలు లాభదాయకతపై ప్రభావం చూపినప్పటికీ.. బలమైన డిమాండు అండతో స్టార్‌ సిమెంట్‌ మరోమారు ఆకర్షణీయ పనితీరును కనబర్చిందని ఆనంద్‌ రాఠీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అభిప్రాయపడింది. వ్యయ నియంత్రణకు చేపడుతున్న చర్యలు, ప్రభుత్వ సబ్సిడీ, అధిక డిమాండు పరిస్థితులు లాంటివి కంపెనీకి కలిసిరావచ్చని చెబుతోంది. విస్తరణ కార్యకలాపాలకు నిధులు వెచ్చించినా కూడా నగదు నిల్వలకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చని అంచనా వేసింది. వీటన్నింటి దృష్ట్యా రూ.135 లక్ష్యంతో షేరును కొనుగోలు చేయొచ్చని ఆనంద్‌ రాఠీ సిఫారసు చేస్తోంది.

ప్రిజమ్‌ జాన్సన్‌
లక్ష్యం: రూ.132 (ఎలారా కేపిటల్‌)

సిమెంటు విభాగం ఆకర్షణీయ పనితీరుతో ఈ కంపెనీ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. సిమెంటు ధరలు, డిమాండుకు సానుకూలతలు లాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మున్ముందు కూడా ప్రిజమ్‌ జాన్సన్‌ సిమెంటు విభాగం బలమైన పనితీరును కనబర్చే అవకాశం ఉందని ఎలారా కేపిటల్‌ భావిస్తోంది. అందువల్ల ఈ కంపెనీ షేరుపై సానుకూల ధోరణితో ఉన్నామని చెబుతోంది. రూ.132 లక్ష్యంతో షేరు కొనుగోలుకు సిఫారసు చేస్తోంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.