Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120753
            [news_title_telugu_html] => 

మోదీజీ..ఇదీ మా అర్జీ 

[news_title_telugu] => మోదీజీ..ఇదీ మా అర్జీ  [news_title_english] => [news_short_description] => మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మళ్లీ విజయ ఢంకా మోగించింది. మెజార్టీ స్థానాలను సొంతగానే సాధించినందున, రాజకీయంగా కష్టమయ్యే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం, గత అయిదేళ్లలో పోలిస్తే, భవిష్యత్తులో మరింత సులువు అవుతుంది. ఆర్థిక వృద్ధి కోసం కొత్త ప్రభుత్వం సత్వరం చర్యలు ఆరంభించాలని  మార్కెట్లు విజ్ఞప్తి చేస్తున్నాయి.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,1, ) )
మోదీజీ..ఇదీ మా అర్జీ  - EENADU
close
మోదీజీ..ఇదీ మా అర్జీ 

వినియోగ గిరాకీ పెంచే చర్యలు కావాలి 
ఎన్‌బీఎఫ్‌సీల సమస్య పరిష్కరించాలి 
ప్రభుత్వ బ్యాంకులకు మూలధనం ఇవ్వండి 
అపుడే స్టాక్‌మార్కెట్లు రాణిస్తాయ్‌ 
మార్కెట్‌ వర్గాల విజ్ఞప్తులు

మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మళ్లీ విజయ ఢంకా మోగించింది. మెజార్టీ స్థానాలను సొంతగానే సాధించినందున, రాజకీయంగా కష్టమయ్యే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం, గత అయిదేళ్లలో పోలిస్తే, భవిష్యత్తులో మరింత సులువు అవుతుంది. ఆర్థిక వృద్ధి కోసం కొత్త ప్రభుత్వం సత్వరం చర్యలు ఆరంభించాలని  మార్కెట్లు విజ్ఞప్తి చేస్తున్నాయి. 

న్నికల కారణంగా గత ఏడాది కాలంగా ప్రజాకర్షక పథకాలపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ రుణ ఎగవేతల వల్ల గత ఆగస్టులో మొదలైన సంక్షోభంపై కఠిన వైఖరి ప్రదర్శించలేకపోయింది కూడా. కొత్త ప్రభుత్వం దీనిపై సత్వరం దృష్టి సారించాలి. నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)ల్లో జవసత్వాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక అంశాలపై ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ముందడుగు వేయాలి. 
వ్యాపారాలు సజావుగా సాగడానికి కావలసిన ప్రైవేటు పెట్టుబడులు పెరిగేలా చేయాల్సి ఉందని బ్రోకరేజీ సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రైవేటు పెట్టుబడులు పెరగాలంటే ఆర్థిక రంగంలో ఆస్తుల నాణ్యతలు, వినియోగం మెరుగుపడాలి.   స్వల్పకాలిక రుణమార్కెట్‌ పుంజుకోవాలి. అయితే అంచనాల కంటే తక్కువగా నమోదవుతున్న పన్ను వసూళ్లు ఆర్థిక వ్యవస్థకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు మూలధన బదిలీ కీలకంగా మారింది. బిమల్‌ జలాన్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఈ విషయాన్ని సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ వద్ద అదనంగా ఉన్న రూ.1-3 లక్షల కోట్ల నిల్వలను ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన పునర్నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు. అది ప్రైవేటు పెట్టుబడులకు ఊతం ఇస్తుంది. ఇప్పటిదాకా బ్యాంకులు రుణాలు ఇచ్చే సామర్థ్యం లేక, ఇచ్చిన రుణాలను రాబట్టుకోలేక ఇబ్బందుల పాలవుతూ వచ్చాయి. 
పేదలకు నగదు బదిలీని పెంచే అవకాశం కనిపిస్తోంది. తక్కువ వర్షపాత అంచనాలు, తగ్గిన ఆహార ధరల వల్ల రైతు ఆదాయం తగ్గినా.. ఈ పరిణామం మేలు చేస్తుందని మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా తన నివేదికలో పేర్కొంది. కొత్త ప్రభుత్వం గత సంస్కరణలను కొనసాగిస్తుందని, అదే సమయంలో దీర్ఘకాల వృద్ధి కోసం కొత్తగా భారీ సంస్కరణలనూ తీసుకువచ్చే అవకాశం లేకపోలేదని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంటోంది.  ఎన్‌డీఏ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందన్న అంచనాల మధ్య గత నాలుగు నెలల్లో 8 శాతం పైగా రాణించిన ప్రామాణిక సూచీలు.. ఇపుడు కొత్త ప్రభుత్వం ఆర్థిక వృద్ధి కోసం ఎటువంటి చర్యలు చేపడుతుందన్న దాన్ని బట్టి ముందుకు సాగే అవకాశం ఉంది. 

వాహన రంగానికి ప్రాధాన్య హోదా ఇవ్వండి: సియామ్‌ 
కొత్త ప్రభుత్వం ఆర్థిక వృద్ధికి చేయూతనిచ్చే చర్యలను త్వరగానే చేపడుతుందని.. దాని వల్ల వాహన రంగం సహా అన్ని వినియోగ వస్తువుల గిరాకీ పెరుగుతుంద’ని వాహన తయారీదార్ల సంఘం సియామ్‌ ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది. వాహన పరిశ్రమకు ‘ప్రాధాన్య’ హోదాను ప్రభుత్వం ఇస్తుందని అంచనా వేస్తున్నట్లు సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా పేర్కొన్నారు. ‘ప్రస్తుతం పరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లో నడుస్తోంది. అన్ని విభాగాల్లో గిరాకీ మందగించింది. కొత్త ప్రభుత్వం తీసుకునే చర్యలు గిరాకీని పెంచుతాయ’ని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్పొరేట్‌ పన్ను తగ్గాలి.. మ్యాట్‌ ఎత్తేయాలి: ఫిక్కీ

రానున్న బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్ను తగ్గించాలని పరిశ్రమల సంఘం ఫిక్కీ కోరుతోంది. అదే సమయంలో కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్‌)ను ఎత్తివేయాలనీ విజ్ఞప్తి చేస్తోంది. ఫిబ్రవరిలో 2019-20కి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. వచ్చే జులైలో పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ‘దేశీయ పెట్టుబడులను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నాం. అంతర్జాతీయంగా భారత్‌ పోటీనివ్వాలంటే.. కార్పొరేట్‌ పన్ను తగ్గించాల్సిన అవసరం ఉంద’ని ముందస్తు బడ్జెట్‌ చర్చల్లో భాగంగా ఫిక్కీ రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.