Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 139971
      [news_title_telugu_html] => 

విరాల్‌ నిష్క్రమణ‌

[news_title_telugu] => విరాల్‌ నిష్క్రమణ‌ [news_title_english] => [news_short_description] => ఆర్‌బీఐ స్వతంత్రతను దెబ్బతీస్తున్నారని ప్రజా వేదికలపైనే బహిరంగంగా ప్రభుత్వంపై విమర్శలు చేసిందా స్వరం.  ఆర్‌బీఐపై సెక్షన్‌ 7 లాంటివి ప్రయోగించినపుడు, అదనపు నిల్వధనాన్ని ఇవ్వాలన్నపుడు తీవ్రంగా మండిపడిందా స్వరం. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌, మితభాషి అయిన ఉర్జిత్‌పటేల్‌కు బాసటగా నిలిచారా వ్యక్తి. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,1, ) )
విరాల్‌ నిష్క్రమణ‌ - EENADU
close
విరాల్‌ నిష్క్రమణ‌

కొద్ది వారాల కిందటే రాజీనామా
  జులై 23 తర్వాత పనిచేయలేనని స్పష్టీకరణ
  ఇపుడు వెలుగులోకి & ధ్రువీకరించిన ఆర్‌బీఐ
పదవీ కాలానికి ఆరు నెలల ముందే బయటకు
  ఆర్‌బీఐ స్వతంత్రతపై గొంతు విప్పింది ఈయనే

ఆర్‌బీఐ స్వతంత్రతను దెబ్బతీస్తున్నారని ప్రజా వేదికలపైనే బహిరంగంగా ప్రభుత్వంపై విమర్శలు చేసిందా స్వరం.  ఆర్‌బీఐపై సెక్షన్‌ 7 లాంటివి ప్రయోగించినపుడు, అదనపు నిల్వధనాన్ని ఇవ్వాలన్నపుడు తీవ్రంగా మండిపడిందా స్వరం. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌, మితభాషి అయిన ఉర్జిత్‌పటేల్‌కు బాసటగా నిలిచారా వ్యక్తి. గతేడాది డిసెంబరులో ఉర్జిత్‌ నిష్క్రమించినపుడే ఆయన కూడా బయటకు వెళతారని అందరూ అనుకున్నారు.
అదే జరిగింది. అయితే కాస్త ఆలస్యంగా. అవును విరాల్‌ ఆచార్య తన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ బాధ్యతలకు రాజీనామా చేశారు. అది కూడా పదవీ కాలం ఇంకా ఆరు నెలలు ఉండగానే.
విచిత్రం ఏమిటంటే కొద్ది వారాల కిందటే రాజీనామా చేసినా.. తాజాగా ఆర్‌బీఐ ఆ విషయాన్ని ధ్రువీకరించింది. అది కూడా మీడియా కథనాల నేపథ్యంలో. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే కమిటీలో ఏకైక డిప్యూటీ గవర్నర్‌ ఈయనే కావడం గమనార్హం.

దిల్లీ

కిశోర్‌ కుమార్‌ పాటలను ఇష్టపడే విరాల్‌ ఆచార్య స్వరం ఇక ఆర్‌బీఐలో వినిపించకపోవచ్చు. జనవరి 20, 2017న మూడేళ్ల కాలానికి డిప్యూటీ గవర్నర్‌గా పగ్గాలు చేపట్టారాయన. ఆ స్థానాన్ని దక్కించుకున్న అతిపిన్న వయస్కుడాయన. ఆచార్య జులై 23న నిష్క్రమిస్తున్నట్లు ఆర్‌బీఐ కూడా సోమవారం ధ్రువీకరించింది. వచ్చే జనవరి వరకు ఈయన పదవీ కాలం ఉండడం గమనార్హం.  ఆరు నెలల ముందే పదవీకాలాన్ని ఈయన ఎందుకు త్యజించినట్లు? ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉంచిన ప్రకారం.. ‘అనివార్య వ్యక్తిగత పరిస్థితుల’ రీత్యా ముందుగానే ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ బాధ్యతల నుంచి విరాల్‌ ఆచార్య వైదొలగుతున్నారు. ‘జులై 23, 2019 తర్వాత బాధ్యతలను కొనసాగించలేనని..కొద్ది వారాల కిందట డాక్టర్‌ ఆచార్య ఆర్‌బీఐకి లేఖ రాశారు. అయితే ఆయన నిష్క్రమణపై కంపీటెంట్‌ అథారిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంద’ని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎలా బయటకు వచ్చిందంటే..: జులై చివరి కంటే ముందే ఆచార్య వైదొలగుతున్నారని ఒక ఆంగ్లపత్రిక తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా ఆచార్యనే ఆ విషయాన్ని చెప్పినట్లు తెలిపింది. ఇక ఆర్‌బీఐ తన వెబ్‌సైట్‌లో ఆ విషయాన్ని ధ్రువీకరించక తప్పలేదు. ఎందుకు నిష్క్రమిస్తున్నారని ఆయన్ని అడగ్గా.. ‘ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో చూడండ’న్నారు.
ఎందుకు బయటకెళుతున్నారు..
ఉర్జిత్‌ పటేల్‌ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఏడాది ముందుగానే రాజీనామా చేశారు. అప్పట్లో అది పెద్ద కలకలం సృష్టించింది. ఆయనకు ఇష్టమైన ఆచార్య సైతం తన బాధ్యతల నుంచి ఆరు నెలల ముందుగానే వైదొలగుతున్నారు. ఈ రెండింటికి కారణాలు దాదాపు ఒకటే. ఇవి తెలుసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్లాలి.

* సెక్షన్‌ 7 కలకలం: గతేడాది అక్టోబరులో విరాల్‌ ఆచార్య బహిరంగ సమావేశంలో ప్రభుత్వాన్ని విమర్శించారు. అది కూడా ఆర్‌బీఐ స్వతంత్రతను ప్రమాదంలోకి నెడుతున్నారని తీవ్ర స్వరంతోనే హెచ్చరించారు. అందుకు ఉర్జిత్‌ పటేల్‌ కూడా మద్దతునిచ్చారు. అది కాస్తా.. ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య సంఘర్షణకు దారితీసింది. అంతలా విరాల్‌ తీవ్ర స్వరంతో విరుచుకుపడడానికి కారణం ఆర్‌బీఐపై ప్రభుత్వం ప్రయోగించిన సెక్షన్‌ 7. ఆర్‌బీఐ చట్టంలోని ఈ సెక్షన్‌ ప్రకారం.. ప్రభుత్వం ఆర్‌బీఐకి ఆదేశాలు జారీ చేయవచ్చు. అంటే అది ఏం చెబితే అది చెయ్యాల్సిందేనన్నమాట. సరిగ్గా ఇక్కడే విరాల్‌ ఆచార్య వంటి యువ ఆర్థికవేత్త ప్రతిస్పందించారు.
* దిద్దుబాటు చర్యలూ నచ్చలేదు: అదీకాక ప్రభుత్వం చేపడుతున్న ఆస్తుల నాణ్యత నిబంధనల కఠినతరం, బ్యాంకులపై దిద్దుబాటు చర్యలు.. తదితరాలపైనా ప్రభుత్వం ప్రతికూల భావనలతో ఉంది.
* అసలు కారణం.. అదనపు నిధులు: వీటన్నిటినీ పక్కనపెడితే.. ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ప్రభుత్వానికి తరలించాలన్న సూచన ప్రభుత్వం, ఆర్‌బీఐల మధ్య దూరాన్ని మరింత పెంచింది. అదనపు నిధుల బదిలీకి అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌, డిప్యూటీ గవర్నర్‌ ససేమిరా అన్నారు. అదనంగా ఉన్న రూ.3.6 లక్షల కోట్ల మూలధనంలో అధిక భాగాన్ని బదిలీ చేయించుకోవడం ద్వారా ప్రభుత్వం తన ద్రవ్యలోటును తగ్గించుకోవాలనుకుంది. అయితే తన అక్టోబరు ప్రసంగంలో విరాల్‌ ఆచార్య వీటన్నిటినీ తప్పుపట్టారు.
* సంఘర్షణ.. ఉర్జిత్‌ రాజీనామా: దీంతో ఆర్‌బీఐ బోర్డులో ఉన్న ప్రభుత్వ నామినీలు ఆర్‌బీఐ నిర్ణయాలపై ప్రతికూల స్వరాన్ని వినిపించారు. ఇది కాస్తా బోర్డు సమావేశాలన్నీ రోజంతా కొనసాగినా.. ఏ చర్చా.. ఏ నిర్ణయమూ తుది రూపు నకు రాలేకపోయింది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఎటువంటి ధిక్కారం ఆర్‌బీఐ నుంచి కనిపించకపోయే సరికి అన్నీ సర్దుకుపోయాయి అనుకున్నారు. అయితే చాపకింద నీరులాగా ఉన్న ఆ సంఘర్షణ ఉర్జిత్‌ డిసెంబరులో రాజీనామా చేయడానికి కారణమైంది.

మళ్లీ ఆచార్యుడిగా..

అంతక్రితం తాను చేపట్టిన అధ్యాపక వృత్తిని ఆచార్య కొనసాగించే అవకాశాలున్నాయి. న్యూయార్క్‌ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో సీవీ స్టార్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌గా పనిచేశారాయన. ఇపుడు తిరిగి ఆయన అదే స్థానంలోకి వెళ్లిపోవచ్చంటున్నారు.

* సంఘర్షణ మొత్తం సర్దుబాటు: ఆ తర్వాత ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం చేసిన విన్నపాలపై.. ముఖ్యంగా అదనపు నిధుల విషయంలో నిర్ణయం తీసుకోవడం కోసం ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యల(పీసీఏ) చట్రం నుంచి బ్యాంకులను ప్రభుత్వం బయటపడేసింది. బ్యాంకులకు మూలధనాన్ని చొప్పించడం ద్వారా విజయవంతంగా ఆ పనిచేయగలిగింది. ఇక ఆస్తుల నాణ్యతపై ఆర్‌బీఐ ఇచ్చిన ఫిబ్రవరి 12 సర్క్యులర్‌ సాంకేతిక కారణాల వల్ల సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో బ్యాంకుల నుంచి స్పందనను తీసుకుని.. మరింతగా నిబంధనలను సరళీకరించింది. ముఖ్యంగా ఎగవేత నిబంధనలను సరళీకరించింది.
అయితే వివిధ అంశాలపై కఠిన ధోరణి ఉండక తప్పదని భావించే విరాల్‌ ఆచార్యకు ఇవన్నీ రుచించలేదు. ఇక పరపతి విధాన కమిటీలోనూ ఆయన రెపో రేటు కోతకు ఓటు వేసినా కూడా తన అభిప్రాయాలను మాత్రం గట్టిగానే చెప్పేవారు. జూన్‌ 3-6 పరపతి విధాన కమిటీ సమావేశం మినిట్స్‌ ప్రకారం.. ప్రభుత్వం చేసే అదనపు బడ్జెటరీ వ్యయాలు ద్రవ్య లోటు నిర్వహణపై ప్రభావం చూపుతాయని విరాల్‌ కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. మొత్తం మీద ఉర్జిత్‌ వెళ్లిన వెంటనే ఆచార్య కూడా వెళతారన్న అంచనాలు ఆరు నెలలు ఆలస్యంగానైనా నిజమే అయ్యాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.