Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177486
            [news_title_telugu_html] => 

నష్టగమనం 

[news_title_telugu] => నష్టగమనం  [news_title_english] => [news_short_description] => ‘మార్కెట్‌ నష్టాలు ఇప్పటికైనా ఆగితే బాగుణ్ను’ రాత్రి నిద్రపోయే ముందు.. ఉదయం నిద్రలేచాక మదుపరి కోరుకుంటున్న కోరిక ఉదయం నష్టాలతో ప్రారంభమైతే కూడా.. మధ్యాహ్నం తర్వాతైనా తిరిగి లాభాల్లోకి వస్తుందేమోనని ఏ మూలనో అతనిలో ఆశ.. కాని ఏం చేద్దాం.. ఆ కోరిక.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,1, ) )
నష్టగమనం  - EENADU
close
నష్టగమనం 

వెంటాడిన మందగమన భయాలు 
ఉపశమన చర్యల ఆశలపై ప్రభుత్వం నీళ్లు 
సెన్సెక్స్‌ 587 పాయింట్లు పతనం 
10800 దిగువకు నిఫ్టీ

‘మార్కెట్‌ నష్టాలు ఇప్పటికైనా ఆగితే బాగుణ్ను’ రాత్రి నిద్రపోయే ముందు.. ఉదయం నిద్రలేచాక మదుపరి కోరుకుంటున్న కోరిక ఉదయం నష్టాలతో ప్రారంభమైతే కూడా.. మధ్యాహ్నం తర్వాతైనా తిరిగి లాభాల్లోకి వస్తుందేమోనని ఏ మూలనో అతనిలో ఆశ.. కాని ఏం చేద్దాం.. ఆ కోరిక..

ఈ ఆశ రెండూ నెరవేరడం లేదు. స్టాక్‌ మార్కెట్‌కు నష్టాలగమనం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ డీలాపడింది. ఎఫ్‌పీఐల సర్‌ఛార్జీ పెంపు ప్రతిపాదనపై ఆందోళనలకు.. ఆర్థిక మందగమన భయాలు, రూపాయి క్షీణత తోడవడం ఇందుకు నేపథ్యం .

యెస్‌బ్యాంక్‌ షేరు కుదేల్‌

* యెస్‌ బ్యాంక్‌ షేరు కుదేలయ్యింది. బీఎస్‌ఈలో 13.91% పతనమై 56.30 వద్ద ముగిసింది 
* పరిపాలనా వైఫల్యం, ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీజీ పవర్‌ నుంచి యెస్‌ బ్యాంక్‌కు బకాయిలు రావాల్సి ఉండటమే ఇందుకు నేపథ్యం 
* సెన్సెక్స్‌ షేర్లలో అత్యధికంగా నష్టపోయింది కూడా యెస్‌ బ్యాంక్‌ షేరే

పడేశాయ్‌ ఇవే..

ఆర్థిక మందగమనంలో చిక్కుకున్న రంగాలకు ఉపశమన చర్యలు ఉండకపోవచ్చంటూ ప్రభుత్వం స్పష్టతనివ్వడం రూపాయి 8 నెలల  కనిష్ఠానికి పడిపోవడం విదేశీ మార్కెట్లు నిస్తేజంగా కదలాడటం 

8 నెలల కనిష్ఠానికి రూపాయి..

అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 నెలల కనిష్ఠానికి పడిపోయింది. గురువారం రూ.71.65 వద్ద బలహీనంగా ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్‌ ఆ తర్వాత రూ.71.97 స్థాయికి పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 26 పైసలు తగ్గి రూ.71.81 వద్ద స్థిరపడింది. డిసెంబరు 13న నమోదైన రూ.71.55 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. 

ఆ ఒక్కటి 
సెన్సెక్స్‌లో 3 ఐటీ షేర్లతో పాటు హెచ్‌యూఎల్‌ షేరూ రాణించింది

ఐటీ.. మేటి 
సెన్సెక్స్‌ 30లో కేవలం 4 షేర్లే సానుకూలంగా ముగిశాయి. ఆ 4 షేర్లలో మూడు ఐటీ షేర్లే. అవి.. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 

మధ్యాహ్నం మంట 
* సెన్సెక్స్‌ 37,087.58 పాయింట్ల వద్ద ఆరంభమైంది. ఇదే ఇంట్రాడే గరిష్ఠం కూడా. 
* ఆ తర్వాత కూడా నష్టాల్లోనే కదలాడింది. ఎక్కడా కాస్తాయినా కోలుకోలేదు. 
* మధ్యాహ్నం నుంచి అమ్మకాలు తీవ్రరూపం దాల్చడంతో 36,39135 పాయింట్లకు పడిపోయింది. 
* చివరకు 587.44 పాయింట్ల నష్టంతో 36,472.93 పాయింట్ల వద్ద ముగిసింది. 
* నిఫ్టీ 177.35 పాయింట్లు కోల్పోయి 10,741.35 పాయంట్ల వద్ద స్థిరపడింది. 
* సెన్సెక్స్‌, నిఫ్టీలు నష్టాలతో ముగియడం వరుసగా ఇది మూడో రోజు కావడం గమనార్హం.

జులై 22   ఆగస్టు 22   క్షీణత 
సెన్సెక్స్‌ 38031 36473 1558 (4.1%) 
నిఫ్టీ 11346 10741 605  (5.3%)

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.