close
డిసెంబరులో నియామకాలు పెరిగాయ్‌

నౌకరీజాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ నివేదిక

ముంబయి: గతేడాది డిసెంబరులో నియామకాలు పెరిగాయని నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. 2017 డిసెంబరుతో పోలిస్తే గతేడాది డిసెంబరులో ఇవి 8 శాతం మేర రాణించాయని చెబుతోంది. ముఖ్యంగా వాహన, వాహన విడిభాగాల పరిశ్రమ 24%; మానవ వనరుల విభాగం 17% చొప్పున నియమాకాల్లో వృద్ధిని నమోదు చేశాయని వివరించింది. ఐటీ-సాఫ్ట్‌వేర్‌ రంగంలో నియామకాలు 14% పెరిగినట్లు తెలిపింది. బెంగళూరు, దిల్లీలలో వరుసగా 13%, 10% మేర నియామకాలు మెరుగయ్యాయని వెల్లడించింది.

‘గతేడాది చాలా వరకు ప్రధాన నగరాల్లో, అగ్రగామి రంగాల్లో నియామాకాల వృద్ధి బాగుంది. గత కొద్ది నెలలుగా ఐటీ, వాహన, వాహన విడిభాగాల రంగాల్లో నియమాకాలు మెరుగ్గా ఉంటున్నాయి. బీపీఓ, ఎఫ్‌ఎమ్‌సీజీలకు ఇది మంచి ఏడాది. ఈ నియామకాల ధోరణి కొనసాగుతుందనే భావిస్తున్నామ’ని నివేదిక విడుదల సందర్భంగా ఇన్ఫోఎడ్జ్‌ ఇండియా సీఎమ్‌ఓ సుమీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు..

* పారిశ్రామిక వృద్ధి 22% నమోదు కావడంతో చెన్నైలో నియామకాలు 9% పెరిగాయి.
* ముంబయిలోనూ 9% మేర వృద్ధి కనిపించింది. ముఖ్యంగా ఇక్కడి ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ నియామకాలు 12% పెరిగాయి.
* బెంగళూరులో నియామకాలు 13% హెచ్చాయి. ఇక్కడి ఐటీ-హార్డ్‌వేర్‌(18%), ఐటీ సాఫ్ట్‌వేర్‌(22%)లు ఈ విషయంలో ముందున్నాయి.
* పుణె నియామకాల్లో వృద్ధి 15 శాతంగా కనిపించగా.. అక్కడి ఐటీ పరిశ్రమ 20% మేర ఉద్యోగులను పెంచుకుంది.
* మూడేళ్ల వరకు అనుభవం ఉన్న ఉద్యోగుల నియామకాలు 9% పెరగ్గా.. మధ్య స్థాయి యాజమాన్య బాధ్యతల (8-12 ఏళ్లు) కోసం 7%, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి(13-16 ఏళ్ల అనుభవం)లో 2% చొప్పున వృద్ధి నమోదైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.