close
ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.5,300 కోట్లు

దిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) ఈ నెల తొలి 6 ట్రేడింగ్‌ రోజుల్లో రూ.5,300 కోట్ల పెట్టుబడులు చొప్పించారు. మన దేశ ఆర్థిక వృద్ధిపై భారీ అంచనాలతోనే వారు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిపాజిటరీల వద్ద ఉన్న సమాచారం మేరకు, ఫిబ్రవరి 1-8 తేదీల మధ్య ఈక్విటీ మార్కెట్లలోకి వారు రూ.5,273 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ఇదే సమయంలో రుణ మార్కెట్ల నుంచి మాత్రం రూ.2,795 కోట్లు వెనక్కి తీసుకున్నారు. గత నెలలోనూ వారు రూ.5,264 కోట్లు వెనక్కి మళ్లించారు. నవంబరు-డిసెంబరులో మాత్రం రూ.5,884 కోట్లు పెట్టుబడులు పెట్టారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.