close

రూ.27,380 కోట్లు బదిలీ చేయండి

ఆర్‌బీఐని కోరిన ఆర్థిక శాఖ

దిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  (ఆర్‌బీఐ) గత ఆర్థిక సంవత్సరాల్లో అత్యవసరాల్లో వాడుకునేందుకు (రిస్క్‌, రిజర్వు  కింద) అట్టే పెట్టుకున్న రూ.27,380 కోట్లను తమకు బదిలీ చేయాలని ఆర్థిక శాఖ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016-17 లో ఆర్‌బీఐ రూ.13,190 కోట్లను రిస్క్‌-రిజర్వుల కింద తమ వద్ద ఉంచుకుంది. 2017-18లో ఆ మొత్తాన్ని మరింత పెంచి, రూ.14,190 కోట్లను పక్కన పెట్టారు. ఈ రెండూ కలిపి ఇప్పుడు రూ.27,380 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మధ్యంతర మిగులు (ఇంటెరిమ్‌ సర్‌ప్లస్‌)గా తమకు బదిలీ చేయమని ఆర్థిక శాఖ కోరుతోంది. ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ నుంచి రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండును ఆశిస్తోందని, ఈ నెల ప్రారంభంలోనే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ వెల్లడించిన సంగతి విదితమే. ఆర్‌బీఐ జులై-జూన్‌ను ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.40,000 కోట్లను ప్రభుత్వానికి బదలాయించింది. ఆర్‌బీఐ కేంద్ర బోర్డు గనుక రూ.28,000 కోట్ల బదలాయింపునకు ఆమోదం తెలిపితే 2018-19లో ప్రభుత్వానికి రూ.68,000 కోట్లు సమకూరినట్లు అవుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.69,000 కోట్ల డివిడెండును ప్రభుత్వం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌బీఐ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి డివిడెండు, మిగులు రూపంలో సుమారు రూ.82,911.56 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.