
మరో 8 కోట్లు మారాల్సి ఉంది దిల్లీ: దేశంలో మొత్తం 17 కోట్ల టీవీలున్న నివాసాలుండగా, వీటిల్లో 9 కోట్ల వరకు కొత్త చెల్లింపు విధానంలోకి మారినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ఇందులో 6.50 కోట్లు కేబుల్ కనెక్షన్లు కాగా, మరో 2.5 కోట్లు డీటీహెచ్వి అని వెల్లడించారు. వీరంతా తమకు ఇష్టమైన చానళ్లను ఎంచుకున్నారని శర్మ చెప్పారు. మరో 8 కోట్ల కనెక్షన్లు మారాల్సి ఉందని, ఇందులో 3.50 కోట్లు కేబుల్ గృహాలని, మరో 4.50 కోట్ల మంది డీటీహెచ్ చందాదార్లని పేర్కొన్నారు. వీరు కూడా అసౌకర్యానికి గురవకుండా కొత్త విధానంలోకి మారేందుకు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. చానళ్లను వినియోగదారులే ఎంపిక చేసుకునే నూతన విధానంలోకి మారడం వేగవంతమవుతోందని శర్మ వివరించారు. రాయితీలు ఒకే విధంగా ఉండాలి
ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ
డీటీహెచ్ కనెక్షన్లు ప్రీపెయిడ్లో ఉంటాయని, ఇంతకుముందు జరిపిన చెల్లింపు పూర్తయ్యేవరకు పాత పద్ధతిలోనే ప్రసారాలు కొనసాగుతాయని, గడువు తీరాక కొత్త విధానంలోకి ఇవి కూడా మారతాయని శర్మ తెలిపారు. వినియోగదార్లకు అవగాహన కల్పించేందుకు ప్రసార - సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. ఒకే ఇంటిలో ఎక్కువ టీవీలుంటే, వారికి ప్రత్యేక పథకాలు అమలు చేయమని ఆపరేటర్లను కోరామన్నారు. ఆపరేటర్లు రాయితీలు ఇవ్వవచ్చని, నెట్వర్క్ సామర్థ్య రుసుమును రూ.130 వరకు మాఫీ చేయవచ్చనీ శర్మ తెలిపారు. అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ప్రధానాంశాలు

దేవతార్చన
- పది కిలోమీటర్ల దూరంలో ఇల్లు తీసుకుని..
- తండ్రి కారు కింద చితికిపోయిన చిన్నారి
- ‘రాక్షసులు మళ్లీ చెలరేగిపోయారు..చంపేయండి’
- కన్నబిడ్డ వివాహమైన కాసేపటికే
- ఉగ్రదాడిని ఖండిస్తూనే.. చైనా వక్రబుద్ధి
- 130 కోట్ల భారతీయులు దీటైన జవాబిస్తారు
- ప్రేమ వ్యవహారమే కారణమా?
- మేడమ్.. నా పిల్లలకు తల్లి ఉంది
- ఆస్ట్రేలియా సిరీస్కు కేఎల్ రాహుల్
- పుల్వామా దాడి గురించి ముందే హెచ్చరించారా?