close
2017-18 ఆడిట్‌ నివేదిక దాఖలుకు జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పోర్టల్‌ సిద్ధం

దిల్లీ: రూ.2 కోట్లకు పైగా వార్షిక టర్నోవరు ఉన్న వ్యాపారులు 2017-18 ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీ ఆడిట్‌ నివేదికలను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు. జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పోర్టల్‌లో ఈ మేరకు ఓ ఫార్మాట్‌ను జీఎస్‌టీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన అనంతరం మొట్టమొదటి ఆర్థిక సంవత్సరమైన 2017-18కు ఆడిట్‌ నివేదికను జూన్‌ 30 కల్లా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆడిట్‌ నివేదికల నిమిత్తం జీఎస్‌టీఆర్‌-9, జీఎస్‌టీఆర్‌-9ఏ, జీఎస్‌టీఆర్‌-9సీ వార్షిక రిటర్న్‌ ఫారాలను 2018 డిసెంబరు 31న ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటి దాఖలు గడువు తేదీని మూడు నెలలు అంటే జూన్‌ 30వ తేదీ వరకు  జీఎస్‌టీ మండలి గత డిసెంబరులో పొడిగించింది. జీఎస్‌టీఆర్‌-9ఏ కాంపోజిషన్‌ చెల్లింపుదార్లు దాఖలు చేయాలి, జీఎస్‌టీఆర్‌-9ను జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ దాఖలు చేయాల్సి ఉంటుంది. జీఎస్‌టీఆర్‌-9సీ అనేది కాస్ట్‌ అకౌంటెంట్‌ లేదా చార్టర్డ్‌ అకౌంటెంట్‌ పరిశీలించి, సంతకం చేసిన రీకాన్సిలేషన్‌ స్టేట్‌మెంట్‌. ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 కోట్లకు మించి టర్నోవరు ఉన్న పన్ను చెల్లింపుదారు దీనిని ఏటా సమర్పించాల్సి ఉంటుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.