close
ఆల్టోకే మళ్లీ అందలం

2018-19 అమ్మకాల్లో మారుతీ మోడళ్ల జోరు
 అత్యుత్తమ-10లో హ్యుందాయ్‌వి 3: సియామ్‌

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో దేశీయంగా అత్యధికంగా విక్రయమైన కారుగా మారుతీ సుజుకీ చిన్నకారు ఆల్టో నిలిచింది. ఎప్పటిలాగానే మారుతీ సుజుకీ మోడళ్లు ర్యాంకులను కొల్లగొట్టాయి. అత్యుత్తమ-10 మోడళ్లలో ఈ కంపెనీవే ఏడు ఉన్నాయి. హ్యుందాయ్‌వి 3 మోడళ్లు స్థానం సంపాదించాయి. భారత కార్ల విపణిలో ఈ రెండు కంపెనీల ఆధిపత్యం మరోసారి స్పష్టమైంది. 2018-19కు వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) విడుదల చేసిన గణాంకాల వివరాలు ఇలా..

* ఆల్టో, డిజైర్‌లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
* 2017-18లో నాలుగో స్థానంలో ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌.. 2018-19లో మూడో స్థానానికి ఎగబాకింది. ఇక బాలెనో మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరింది.
* మారుతీకే చెందిన ఎస్‌యూవీ విటారా బ్రెజా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో స్థానం పొందింది.
* హ్యుందాయ్‌కు చెందిన ఎలైట్‌ 20కి ఆరో స్థానం దక్కగా.. గ్రాండ్‌ ఐ10, క్రెటా మోడళ్లు వరుసగా 7, 8 ర్యాంకులను పొందాయి.
* మారుతీ వ్యాగన్‌ఆర్‌ 9వ స్థానంలో నిలిచింది. 2017-18లో  అయిదో స్థానంలో ఉంది. సెలెరియోకు పదో స్థానం దక్కింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.