close
పారిశ్రామికోత్పత్తి వృద్ధి భళా

  ఏప్రిల్‌లో 6 నెలల గరిష్ఠానికి
  నెమ్మదించిన తయారీ రంగం

దిల్లీ: గనులు, విద్యుదుత్పత్తి రంగాలు మెరుగైన ఉత్పత్తిని నమోదుచేయడంతో ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి దూసుకెళ్లింది. 6 నెలల గరిష్ఠానికి చేరింది. పారిశ్రామికోత్పత్తి వృద్ధిని పారిశ్రామికోత్పత్తి సూచీతో (ఐఐపీ) లెక్కిస్తారు. ఏప్రిల్‌లో ఇది 3.4 శాతంగా నమోదైంది. 2018 అక్టోబరులో నమోదైన 8.4 శాతం వృద్ధి తర్వాత ఇదే అత్యధిక స్థాయి. అయితే పారిశ్రామికోత్పత్తి వృద్ధి 6 నెలల గరిష్ఠానికి చేరినప్పటికీ.. 2018 ఏప్రిల్‌తో పోలిస్తే తక్కువగానే ఉండటం గమనార్హం. గతేడాది ఏప్రిల్‌లో ఐఐపీ సూచీ 4.5 శాతం వద్ద ఉంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆయా రంగాల ఉత్పత్తి వృద్ధి ఇలా..
* ఏప్రిల్‌లో గనులు రంగ ఉత్పత్తి వృద్ధి 5.1 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 3.8 శాతం వృద్ధితో పోలిస్తే పెరిగింది.
* విద్యుదుత్పత్తి వృద్ధి కూడా కిందటేడాది ఏప్రిల్‌లో నమోదైన 2.1 శాతంతో పోలిస్తే పెరిగి 6 శాతంగా నమోదైంది.
* తయారీ రంగ వృద్ధి మాత్రం ఏడాదిక్రితంతో పోలిస్తే తగ్గి 2.8 శాతానికి పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌లో ఈ రంగ ఉత్పత్తిలో 4.9 శాతం వృద్ధి నమోదైంది.
* మౌలిక/ నిర్మాణ వస్తువులు, వినియోగ వస్తువుల రంగాల ఉత్పత్తి కూడా నెమ్మదించింది.
* ప్రాథమిక వస్తువుల ఉత్పత్తి మాత్రం కిందటేడాది ఏప్రిల్‌లో నమోదైన 2.7 శాతంతో పోలిస్తే పెరిగి 5.2 శాతంగా నమోదైంది.
* తయారీ రంగంలోని 23 పరిశ్రమ విభాగాల్లో 14 సానుకూల వృద్ధిని నమోదుచేశాయి.

 

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.