close
భారత్‌ వృద్ధి 6.6 శాతమే

2019-20కి ఫిచ్‌ కోత

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత వృద్ధి అంచనాలను వరుసగా రెండో సారి ఫిచ్‌ తగ్గించింది. ముందు 7 శాతంగా అంచనా వేసిన ఫిచ్‌.. మార్చిలో దాన్ని 6.8 శాతానికి కోత వేసింది. తాజాగా 6.6 శాతానికి తగ్గించడం గమనార్హం. గత ఏడాది కాలంలో తయారీ, వ్యవసాయ రంగాలు నెమ్మదించడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో 7.1 శాతం, 2021-22లో 7 శాతంగా వృద్ధి నమోదుకావొచ్చని తాజాగా విడుదల చేసిన గ్లోబల్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌లో ఫిచ్‌ అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ అయిదేళ్లలోనే కనిష్ఠంగా 6.8 శాతం వృద్ధి సాధించింది. ఇక జనవరి- మార్చి త్రైమాసికంలో కేవలం 5.8 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.