close
సాఫ్ట్‌వేర్‌లోనే అత్యధిక ఉద్యోగాలు

తర్వాతి స్థానంలో తయారీ పరిశ్రమ
షైన్‌.కామ్‌ నివేదిక వెల్లడి

ముంబయి: దేశంలో ఉద్యోగ సృష్టి విషయంలో ఐటీ-సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మే నెలలోనూ తన హవాను ప్రదర్శించింది. ఆ తర్వాతి స్థానంలో తయారీ రంగం అత్యధిక ఉద్యోగాలను ఇస్తున్నట్లు జాబ్‌ పోర్టల్‌ షైన్‌.కామ్‌ తన నివేదికలో వెల్లడించింది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..
* ఈ ఏడాది మే నెలలో గతేడాది ఇదే సమయంలో పోలిస్తే ఐటీ-సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ గరిష్ఠ వృద్ధిని నమోదు చేసింది. అయితే గతేడాది ఇదే నెలలో వినియోగదారు సేవలు అగ్రస్థానంలో నిలిచింది. ఈ సారి మాత్రం అది అయిదో స్థానానికి పరిమితమైంది.
* నాణ్యత, పరీక్షల రంగం మే 2018 తర్వాత తొలిసారిగా టాప్‌-5లోకి చేరింది.
* బీపీఓ, కాల్‌ సెంటర్‌ పరిశ్రమ మే 2018లో మూడో స్థానంలో ఉండగా.. ఈ సారి టాప్‌-5 నుంచి నిష్క్రమించింది.
* టెలికాం రంగం అగ్రగామి 10 ఉద్యోగ సృష్టి రంగాల్లో ఒకటిగా నిలిచింది. 2018 నుంచీ ఇది మెరుగైన వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది.
* విమానయాన రంగం కొంత మందగమనాన్ని కనబరచింది. ప్రస్తుతం జాబితాలో పదో స్థానంలో ఉంది. టాప్‌-10లో నిలిచిన ఇతర పరిశ్రమల్లో నియామకాలు, విద్య, శిక్షణ, బ్యాంకులు-బీమా రంగాలున్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.