
బెంగళూరులో కేసు నమోదు
ఈనాడు, హైదరాబాద్: కార్వీ గ్రూపులోని కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈఓ అభిజిత్ భావే, కార్వీ రియాల్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కార్వీ కేపిటల్‌కు చెందిన పలువురు ఉన్నతాధికార్లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కార్వీ ప్రైవేట్ వెల్త్ తమను మోసపుచ్చినట్లు, తత్ఫలితంగా తాము రూ.3.81 కోట్ల మేరకు నష్టపోవలసి వచ్చిందని ఆరోపిస్తూ తొమ్మిది మంది మదుపరులు బెంగళూరు నగరంలోని బసవనగుడి పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు దాఖలైంది. ఏడాదికి 18-20 శాతం ప్రతిఫలం వస్తుందని నమ్మబలికి తమతో పెట్టుబడులు పెట్టించారని, ఆమేరకు తమకు లాభం రాకపోగా పెద్ద ఎత్తున నష్టపోవలసి వచ్చిందని మదుపరులు తమ ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు చేసిన వారిలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఐటీ నిపుణురాలు కెట్కి షా తలటి, ఆమె భర్తి మాయంక్ హర్షద్ తలటి, మరికొందరు ఉన్నారు.
తాము పెట్టుబడి పెట్టే సొమ్ముకు ఎటువంటి రిస్కు ఉండదని కార్వీ ప్రైవేట్ వెల్త్ ప్రతినిధులు తమకు హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. లాభదాయకతమైన సంస్థల్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు ఆర్జిస్తామని చెప్పారని వివరించారు. కానీ అలా జరగలేదని ఆరోపించారు. తమ పొదుపు సొమ్ము మొత్తం తీసుకువచ్చి పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు ఇతర ఫిర్యాదుదార్లు వాపోయారు. తమ వంటి బాధితులు బెంగళూరుతో పాటు ముంబయి, దిల్లీ తదితర నగరాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలిపారు.
ఈ ఆరోపణలపై కార్వీ గ్రూపు వివరణ ఇచ్చింది. తాము ఎవరినీ మోసపుచ్చలేదని, తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మదుపరులకు వారు చేసిన పెట్టుబడుల్లో ఉండే రిస్కుపై ముందుగానే అన్ని వివరాలు తెలియజేసినట్లు పేర్కొంది. ఈ ఫిర్యాదు ప్రధానంగా మూడు నిర్మాణ సంస్థల్లో పెట్టిన పెట్టుబడికి సంబంధించిందని ఈ వ్యవహారంలో తాము మధ్యవర్తిగా ఉన్నట్లు... అంతకు మించి ఇందులో తమ పాత్ర ఏమీ లేదని వివరించింది. అయినా మదుపరులు ఆయా సంస్థల్లో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకువచ్చేందుకు తమ వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కార్వీ గ్రూపు పేర్కొంది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రాహుల్‌కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్