close
మార్కెట్‌ కబుర్లు

* బిహార్‌లోని బక్సర్‌లో అల్ట్రా-సూపర్‌క్రిటికల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎస్‌జేవీఎన్‌ నుంచి రూ.7000 కోట్లకు పైగా ఆర్డరును ఎల్‌ఖీటీ విద్యుత్‌ విభాగం దక్కించుకుంది.
* టాటా సన్స్‌కు 2.46 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను కేటాయించడం ద్వారా నిధులు సమీకరించేందుకు ట్రెంట్‌ వాటాదార్ల అనుమతి కోరింది. రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిధులు వినియోగించనుంది.
* శ్రీరామ్‌ క్యాపిటల్‌లోని మొత్తం 20 శాతం వాటాను విక్రయించేందుకు పిరమాల్‌  ఎంటర్‌ప్రైజెస్‌ సన్నాహాలు చేస్తోంది. పిరమాల్‌ ఆర్థిక సేవల వ్యాపార వృద్ధికి ఈ నిధులు వాడే యోచనలో ఉంది.
* ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ పబ్లిక్‌ ఇష్యూ తొలి రోజున 51% స్పందన లభించింది. ఇష్యూలో 26,92,824 షేర్లను జారీ చేయగా..13,57,365 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
* రైట్స్‌ వాటాదార్లకు బోనస్‌ షేర్లను జారీ చేయనుంది. వాటాదార్లకు ప్రతి 4 షేర్లకు ఒక బోనస్‌ షేరును జారీ చేయనుంది.
* జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియ కోసం ఎన్‌సీఎల్‌టీ నియమించిన రుణ పరిష్కార నిపుణుడు రుణదాతల నుంచి క్లెయిమ్‌లను ఆహ్వానించారు. జులై 4 లోగా రుణదాతలు క్లెయిమ్‌లు దాఖలు చేయాలి.
* మిత్సుబిషి కార్పొరేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ టీసీఎస్‌ జపాన్‌లో వాటాను 66 శాతానికి పెంచుకుంటున్నట్లు టీసీఎస్‌  ప్రకటించింది.
* క్యాటరాక్ట్‌ సర్జరీ చేయించుకున్న రోగులకు వినియోగించుకునే బ్రామ్‌ఫెనాక్‌ ఆప్తాల్మిక్‌ సొల్యూషన్‌కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించిందని అలెంబిక్‌ ఫార్మా తెలిపింది.
* నివాస, వాణిజ్య ప్రాజెక్ట్‌లు, కర్మాగార పనుల నిమిత్తం రూ.514 కోట్ల కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు జేఎంసీ ప్రాజెక్ట్స్‌ తెలిపింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.