close
భళా మారుతీ

 మేలో అమ్ముడుపోయిన 10 మోడళ్లలో 8 ఈ కంపెనీవే

దిల్లీ: దేశీయంగా మే నెలలో అత్యధికంగా విక్రయమైన ప్రయాణికుల వాహన మోడళ్లలో మారుతీ సుజుకీవే అత్యధికం ఉన్నాయి. అత్యధికంగా విక్రయమైన 10 రకాల మోడళ్లలో 8 మారుతీ సుజుకీవేనని వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) పేర్కొంది. అత్యధికంగా విక్రయమైన మోడళ్ల జాబితాలో మారుతీ స్విఫ్ట్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2018 ఇదే నెలలో ఈ కారు 4వ స్థానంలో ఉంది. ఆల్టో మార్పు లేకుండా రెండో స్థానంలో నిలిచింది. సెడాన్‌ డిజైర్‌ అగ్రస్థానం నుంచి 3కు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో స్థానం 3 నుంచి 4కు తగ్గింది. న్యూ వ్యాగన్‌ఆర్‌ 5వ స్థానంలోనే కొనసాగింది. వినియోగ వాహనం ఎకో 6వ స్థానంలోకి రాగా, హ్యందాయ్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం క్రెటా 7లోనే ఉంది. హ్యుందాయ్‌ ఎలైట్‌ ఐ20 స్థానం 9 నుంచి 8కి పెరగ్గా, మారుతీ ఎర్టిగా 9లో, విటారా బ్రెజా 6 నుంచి 10కి తగ్గింది. కాగా గత నెలలో మొత్తంమీద వాహన విక్రయాలు 20 శాతం తగ్గడం గమనార్హం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.