close
మార్కెట్‌ కబుర్లు

* బెంగళూరుకు చెందిన అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌ కంపెనీ లింబిక్‌ను లార్సన్‌ అండ్‌ టూబ్రో ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ) రూ.38 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది.
* ఎల్‌అండ్‌టీ గ్రూపు ఛైర్మన్‌ ఏఎం నాయక్‌ను మైండ్‌ట్రీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నియమించినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.
* ఈక్విటీ షేర్లు, సెక్యూరిటీలు, ఇతర మార్గాల్లో రూ.5,000 కోట్ల నిధులను సమీకరించేందుకు వచ్చే నెల 8న వాటాదార్ల అనుమతి కోరనున్నట్లు అదానీ ట్రాన్స్‌మిషన్‌ వెల్లడించింది.
* అన్నాయ్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించినట్లు తెలిపింది. ఐపీఓ పరిమాణం సుమారు రూ.200-225 కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం.
* ఎల్‌అండ్‌టీ కన్‌స్ట్రక్షన్‌, టెక్టాన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థకు (జేవీ) గుజరాత్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (జీఐడీసీ) నుంచి సుమారు రూ.1,000-2,500 కోట్ల ఆర్డర్‌ దక్కింది.
* కర్నాటకలోని దోనిమలై గనిలో ఇనుప ఖనిజం తవ్వకాలను ఎన్‌ఎండీసీ తిరిగి ప్రారంభించింది. దాదాపు 8 నెలల వ్యవధి తర్వాత మళ్లీ ఇక్కడ కార్యకలాపాలు మొదలయ్యాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.