close
కేజీబేసిన్‌లో రిలయన్స్‌-బీపీ

రూ.35,000 కోట్ల పెట్టుబడులు

దిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్‌లోని 3 సహజవాయువు క్షేత్రాలపై 2022 వరకు రూ.35,000కోట్ల (5 బిలియన్‌ డాలర్ల) పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటిష్‌ భాగస్వామి బీపీ పీఎల్‌సీ సన్నద్ధమవుతున్నాయి. రోజుకు 100 కోట్ల క్యూబిక్‌ ఫీట్‌ (బీసీఎఫ్‌) గ్యాస్‌ను వెలికి తీయాలన్నది తమ లక్ష్యమని బీపీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బెర్నార్డ్‌ లూనే తెలిపారు. 2020 నాటికి ఇంధన విపణిలో అధిక వృద్ధి కలిగిన దేశం భారత్‌ అవుతందని, చైనానూ అధిగమిస్తుందని వివరించారు. 2040 నాటికి భారత్‌లో ఇంధనానికి గిరాకీ రెండున్నర రెట్లు పెరుగుతుందన్నారు. 2050 వరకు దేశీయ గ్యాస్‌ గిరాకీలో 50 శాతం అవసరాలను స్థానిక  ఉత్పత్తి నుంచే తీర్చే సామర్థ్యం ఉందని బెర్నార్డ్‌ తెలిపారు. విద్యుదుత్పత్తికి బొగ్గును మండించడం వల్ల వెలువడే ఉద్గారాల్లో సగం మేర మాత్రమే గ్యాస్‌ను మండించడం వల్ల వెలువడతాయన్నారు. మన దేశంలో కెల్లా అధికంగా గ్యాస్‌ ఉత్పత్తికి ఉపకరించిన ఈ క్షేత్రం మళ్లీ తన ప్రత్యేకత చాటనుంది. కేజీ-డీ6 క్షేత్రంలో అత్యంత లోతైన ఎంజే, డీ 55 బావులతో పాటు ఆర్‌ శ్రేణి బావులు, శాటిలైట్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ క్షేత్రాల నుంచి రోజుకు 30-35 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు పెట్టుబడులను ఈ సంస్థలు గత నెలలోనే ప్రకటించాయి. మహానది బేసిన్‌, నెక్‌-25 క్షేత్రంలోని నిల్వలనూ పరిమిత వ్యయంతో వెలికి తీసేందుకు, సరఫరా చేసేందుకు పైపులైన్‌ నిర్మాణంపైనా రిలయన్స్‌-బీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

ఈ మూడు ప్రాజెక్టుల్లో కలిపి 3 లక్షల కోట్ల అడుగుల గ్యాస్‌ నిల్వల అంచనా
ఆర్‌ శ్రేణి: 2020-21 రెండో అర్థభాగంలో గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
శాటిలైట్‌ క్లస్టర్‌: తదుపరి దశలో ఉత్పత్తి చేపడతారు. ఎంజే: ఈ ప్రాజెక్టుల్లో ఆఖరులో గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభమయ్యేది

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.