close
నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ‘బెస్ట్‌ ప్రైస్‌’

నిజామాబాద్‌ (ఖలీల్‌వాడి), న్యూస్‌టుడే: తెలంగాణలో వాల్‌మార్ట్‌ ఇండియా తన మూడో అతిపెద్ద క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోరు ‘బెస్ట్‌ ప్రైస్‌ మోడర్న్‌ హోల్‌సేల్‌ స్టోర్‌’ను నిజామాబాద్‌లో ప్రారంభించింది. జిల్లా కేంద్రంలోని బోర్గాం(పి) వద్ద ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను బుధవారం సంస్థ సీఈఓ క్రిష్‌ అయ్యర్‌ ప్రారంభించారు. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిష్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2,000 మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్‌, కరీంనగర్‌లలో స్టోర్లు ఉన్నాయని తెలిపారు. నాలుగో స్టోరును ఈ ఏడాదిలోనే వరంగల్‌లో ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. భారత్‌లో నిజామాబాద్‌ కేంద్రం 26వదని తెలిపారు. ఈ కేంద్రంలో బీ2బీ ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫాం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.  స్టోర్‌లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందుబాటులో ఉంచడంతోపాటు, స్థానిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి రోజు తక్కువ ధరలు అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పర్యావరణ హితంగా ఉండేలా ఈ స్టోర్‌ను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.