close
వెండి ముందుకే!

 

బంగారం, వెండి 

సిడి ఆగస్టు కాంట్రాక్టు గత వారం రూ.34,897 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత దిద్దుబాటుకు లోనై రూ.34,862 స్థాయికి దిగివచ్చింది. అనంతరం తక్కువ స్థాయిల వద్ద కొనుగోళ్లు చోటుచేసుకోవడంతో తిరిగి పుంజుకుని రూ.35,409 వద్ద వారం గరిష్ఠాన్ని చేరింది. చివరకు 0.4% లాభంతో రూ.35,036 వద్ద ముగిసింది. ఈవారం లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.34,859 దిగువన తప్పక స్టాప్‌లాస్‌ పెట్టుకుని ట్రేడ్‌ చేసుకోవాలి. ఒకవేళ పసిడి కాంట్రాక్టు రూ.35,402 స్థాయిని మించితే.. అధిక స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు రూ.35,777 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.35,402- 35,586 మధ్య షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవడం మంచి వ్యూహం అవుతుంది. వెండి సెప్టెంబరు కాంట్రాక్టు గత వారం రూ.38,300 స్థాయి వద్ద సానుకూలంగా ఆరంభమైంది. రూ.41,627 వద్ద వారం గరిష్ఠాన్ని చేరింది. చివరకు 6.19% లాభంతో రూ.40,672 వద్ద ముగిసింది. వెండి కాంట్రాక్టు ఇప్పటికే బాగా పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ఈవారం కూడా మరింత పైకి వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటికే లాంగ్‌ పొజిషన్లున్న వాళ్లు వాటిని కొనసాగించొచ్చు. 

ప్రాథమిక లోహాలు  

రాగి జులై కాంట్రాక్టు ఈవారం రూ.461.55 ఎగువన కదలాడకుంటే రూ.468.55 స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.448 దిగువన స్టాప్‌లాప్‌ తప్పక పెట్టుకోవాలి. సీసం జులై కాంట్రాక్టుకు ఈవారం కూడా అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. రూ.156.85 ఎగువన కదలాడకుంటే రూ.149.35 వరకు పడిపోవచ్చు. జింక్‌ జులై కాంట్రాక్టు ఇప్పటికే మోతాదుకు మించి అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ మరికొంత కిందకు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే రూ.187.75 దిగువకు రానంతవరకు లాంగ్‌ పొజిషన్లు కొనసాగించొచ్చు. కొత్తగా లాంగ్‌ పొజిషన్లు కూడా తీసుకోవచ్చు. రూ.187.60 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవడం మరవద్దు. అల్యూమినియం జులై కాంట్రాక్టు ఈ రోజు రూ.140.85 దిగువన ముగిస్తే రూ.139.25 వరకు పడిపోవచ్చు. ఒకవేళ ఈ రోజు రూ.143.15 స్థాయికి ఎగువన ముగిస్తే రూ.145.45 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. నికెల్‌ జులై కాంట్రాక్టు ఈవారం మరికొంత కిందకు దిగిరావచ్చు. అందువల్ల లాంగ్‌ పొజిషన్లున్న వాళ్లు వాటిని వదిలించుకోవడం మంచిది. అలాగే రూ.1,027- 1,060 మధ్య కొత్తగా షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. 

ఇంధన రంగం  

ముడి చమురు ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.4,048 ఎగువన ట్రేడ్‌ కాకుంటే మరింత కిందకు దిగివచ్చే అవకాశం ఉంది. రూ.3,629; రూ.4,548 వరకు పడిపోవచ్చు. ఒకవేళ రూ.4,048 ఎగువన ట్రేడయితే రూ.4,078; రూ.4,203 వరకు పెరిగేందుకు ఆస్కారం ఉంది. అయితే ఈవారం కాంట్రాక్టును లాంగ్‌ చేయడం కంటే షార్ట్‌ సెల్‌ చేయడమే ఉత్తమం. సహజ వాయువు జులై కాంట్రాక్టు ఈవారం రూ.150.85 దిగువన చలించకుంటే పుల్‌బ్యాక్‌ ర్యాలీకి అవకాశం ఉంది. అందువల్ల రూ.148.65 దిగువన స్టాప్‌లాస్‌ పెట్టుకుని, ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహంతో ముందుకెళ్లొచ్చు. ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) జులై కాంట్రాక్టు ఈవారం రూ.493.60 స్థాయికి దిగిరావొచ్చు. 

వ్యవసాయ ఉత్పత్తులు  

సుపు ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.7,385- రూ.7,491 వరకు వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చు. సోయాబీన్‌ ఆగస్టు కాంట్రాక్టుకు గతవారం మాదిరే ఈవారం కూడా ప్రతికూల ధోరణి కొనసాగచ్చు. అందువల్ల షార్ట్‌సెల్‌ పొజిషన్లు అట్టేపెట్టుకోవడం మంచిదే. జీలకర్ర ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.18,298 వరకు జోరు కనబర్చే అవకాశం ఉంది. 

 
 
 
 
- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.